India: మొబైల్ మాల్‌వేర్ దాడుల్లో భారత్ అగ్రస్థానం
భారతదేశంలో ప్రస్తుతం ఫోన్లు మాల్‌వేర్‌లకు ప్రధాన లక్ష్యంగా మారింది. ఈ విషయాన్ని సైబర్ సెక్యూరిటీ సంస్థ 'ది స్కేలర్ థ్రెట్ ల్యాబ్స్ 2024' నివేదించింది. జూన్ 2020 నుండి మే 2024 వరకు మొత్తం 20 బిలియన్ల ప్రమాదకర లావాదేవీలు, సైబర్ ముప్పులను విశ్లేషించిన తర్వాత, భారత్ మాల్‌వేర్ దాడుల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ నివేదిక ద్వారా అమెరికా, కెనడా దేశాలను ఈ దేశం మించిపోయింది. భారతదేశంలో 28శాతం మాల్‌వేర్ దాడులు చోటుచేసుకున్నట్లు నివేదిక తెలిపింది. అమెరికా 27.3% తో రెండవ స్థానంలో ఉంది. కెనడా 15.9% తో మూడో స్థానంలో ఉంది. గతంలో ఈ జాబితాలో భారతదేశం మూడో స్థానంలో ఉండగా, ఇప్పుడు అగ్రస్థానానికి చేరింది.
బ్యాంక్ కస్టమర్ల లక్ష్యంగా సైబర్ దాడులు
బ్యాంకులు, సోషల్ మీడియా, క్రిప్టో వాలెట్లు వంటి ఆర్థిక సంస్థలు కూడా ఈ రకమైన దాడులకు లక్ష్యంగా మారుతున్నాయి. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లను లక్ష్యంగా పెట్టుకొని సైబర్ దాడులు జరుగుతున్నట్లు నివేదిక స్పష్టం చేసింది. వినియోగదారులకు ఎస్‌ఎంఎస్, తప్పుడు వెబ్‌సైట్లు సందేశాల ద్వారా వస్తున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆపరేషనల్ టెక్నాలజీ వంటి భద్రత లేని పరికరాలు సైబర్ క్రిమినల్స్ కు ప్రాథమిక లక్ష్యంగా మారుతున్నాయి. ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భారత్ మాల్‌వేర్ ఆరిజిన్ పాయింట్ ర్యాంకింగ్స్‌లో 5వ స్థానం నుండి 7వ స్థానానికి చేరుకుంది. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మాల్‌వేర్ దాడులలో అగ్రస్థానంలో నిలిచింది. సైబర్ ముప్పులు ఆర్థిక సంస్థలను, బ్యాంకులను సోషల్ మీడియాను లక్ష్యంగా చేసుకుంటున్నాయి.