Page Loader
అరేబియా సముద్రంలో రాత్రి చైనీయుడికి గుండెపోటు.. సాహసోపేతంగా రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్
సాహసోపేతంగా రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్

అరేబియా సముద్రంలో రాత్రి చైనీయుడికి గుండెపోటు.. సాహసోపేతంగా రక్షించిన ఇండియన్ కోస్ట్ గార్డ్

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 17, 2023
01:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

అరేబియా సముద్రంలో భారత కోస్ట్‌ గార్డ్‌ సాహసోపేతమైన చర్యను నిర్వహించింది. ఈ మేరకు నడిసముద్రంలో గుండెపోటుకు గురైన ఓ చైనీయుడ్ని రక్షించింది. నౌక సిబ్బంది యిన్‌ వీగ్‌యాంగ్‌ గుండెపోటుకు గురై ఛాతినొప్పితో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ క్రమంలో నౌక సిబ్బంది సమీప తీర ప్రాంతం ముంబయిలోని మారిటైమ్‌ రెస్క్యూ కో-ఆర్డినేషన్‌ కేంద్రానికి ఎమర్జెన్సీ మెసేజ్ అందించారు. దీంతో అప్రమత్తమైన భారత కోస్ట్‌గార్డ్‌ ALHMK-3 హెలికాప్టర్‌ ద్వారా సముద్ర తీరానికి 200 కి.మీ దూరంలో ఉన్న నౌక వద్ద ఆపరేషన్‌ విజయవంతంగా నిర్వహించింది. చైనా నుంచి అరేబియా మీదుగా యూఈఏ వెళ్తున్న నౌకలో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ప్రతికూల వాతావరణం మధ్య బాధితుడ్ని ఎయిర్‌లిఫ్ట్‌ ద్వారా సమీప ఆస్పత్రికి తరలించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చైనీయుడ్ని రక్షించిన భారత కోస్ట్ గార్డ్