
Gun shot: కెనడాలో కాల్పులు.. భారతీయ సంతతికి చెందిన వ్యక్తి మృతి
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలోని ఎడ్మంటన్లో సోమవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
అందులో ఒకరు భారతీయ సంతతికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు కెనడాలోని ఎడ్మంటన్ సీటీవీ న్యూస్ పేర్కొంది.
కాల్పుల్లో చనిపోయిన వ్యక్తిని ఎడ్మంటన్ లోని గిల్ బిల్ట్ హోమ్స్ యజమాని బూటాసింగ్ గిల్‌గా పోలీసులు గుర్తించినట్లు పేర్కొంది.
పోలీసులు మీడియాతో మాట్లాడుతూ....కేవనాగ్ బౌలెవార్డ్ సౌత్ వెస్ట్, చెర్నియాక్ వే సౌత్ వెస్ట్ ఏరియాలో ఘటన జరగడంతో ఎడ్మంటన్ పోలీస్ సర్వీస్ ఈ ఘటనపై విచారణ చేస్తుందన్నారు.
ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా...అందులో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు.
మూడో వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తుపాకీ కాల్పులలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి మృతి
Indian-origin man among two killed in shooting in Canada’s Edmonton https://t.co/v8pK9EcMFZ #Canada #Edmonton #shooting
— Public TV English (@PublicTVEnglish) April 9, 2024