LOADING...
Chandra Arya:కెనడా ప్రధాని రేసులో నేనున్నానంటూ భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య ప్రకటన!  
కెనడా ప్రధాని రేసులో నేనున్నానంటూ భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య ప్రకటన!

Chandra Arya:కెనడా ప్రధాని రేసులో నేనున్నానంటూ భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య ప్రకటన!  

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 10, 2025
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

కెనడా ప్రధానమంత్రి పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి భారీ పోటీ నెలకొంది. ఈ పోటీలో తాను కూడా ఉన్నానని నేపియన్ ప్రాంత ఎంపీ చంద్ర ఆర్య గురువారం ప్రకటించారు. కెనడా పునర్నిర్మాణం కోసం సమర్థంగా ప్రభుత్వాన్ని నడిపించగల దక్షత కలిగి ఉన్నానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కెనడా భవిష్యత్తు తరాలకు సురక్షిత మార్గాన్ని నిర్మించగలనని ఆయన చెప్పారు. చంద్ర ఆర్య మాట్లాడుతూ,"నేను ఎప్పుడూ కెనడా ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు పనిచేస్తూ, పతనానికి దారితీసే పద్దతులను దూరంగా ఉంచాను.మనం మన పిల్లలకు,మనవళ్లు/మనవరాళ్ల కోసం కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి" అన్నారు.

వివరాలు 

ఆర్థిక వ్యవస్థను పట్టాలు ఎక్కిస్తా! 

"లిబరల్ పార్టీ పార్లమెంటరీ నేతగా ఎన్నుకున్నట్లయితే, నా అనుభవం, జ్ఞానంతో కెనడా దేశానికి వృద్ధి సాధించేందుకు దారి చూపిస్తాను" అని చెప్పారు. కెనడా ప్రస్తుతం ఎదుర్కొంటున్న కఠిన సమస్యలను పరిష్కరించేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. "మన దేశంలో చాలా మంది ప్రజలు ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం పొందలేకపోతున్నారు, ముఖ్యంగా యువత కోసం ఆర్థిక సవాళ్లు ఉన్నాయి. ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలను తీసుకొని, కెనడా ఆర్థిక వ్యవస్థను తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంలో నాకు నమ్మకం ఉంది" అని తెలిపారు.

వివరాలు 

రేసులో భారత సంతతి నేతలు 

చంద్ర ఆర్య తన ప్రచారంలో, "కెనడాలో మధ్యతరగతి ప్రజలు పెనుసవాళ్లను ఎదుర్కొంటున్నారు, చిన్నతరగతి కుటుంబాలు పేదరికంలోకి జారిపోతున్నాయి. దేశానికి ఆర్థిక పునర్నిర్మాణం అవసరం" అని చెప్పారు. పెద్ద నిర్ణయాలు తీసుకోవడంలోనాకు మద్దతుగా నిలవండి అని కెనడా ప్రజలకు చంద్ర ఆర్య పిలుపునిచ్చారు. గత సోమవారం (జనవరి 6న) జస్టిన్ ట్రూడో రాజీనామా చేసినప్పటి నుంచి, కెనడా ప్రధానమంత్రిగా ఎవరు ఉంటారు అనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రధానమంత్రి పదవికి లిబరల్ పార్టీకి చెందిన క్రిస్టినా ఫ్రీలాండ్, మార్క్ కార్నీ, డొమినిక్ లీ బ్లాంక్, మెలనీ జోలీ, ఫ్రాంకోయిస్ ఫిలిప్పీ, క్రిస్టీ క్లార్క్ వంటి నేతలు పోటీ పడుతుండగా, భారత సంతతి ఎంపీలు అనిత ఆనంద్, జార్జ్ చాహల్ కూడా ఈ రేసులో ఉన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చంద్ర ఆర్య చేసిన ట్వీట్