Modi in Ukraine: ఉక్రెయిన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
ఉక్రెయిన్‌లో ఒకరోజు పర్యటన నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ పోలాండ్ నుంచి కీవ్ చేరుకున్నారు. రైలులో దాదాపు 10 గంటల ప్రయాణం తర్వాత ప్రధాని మోదీ ఉక్రెయిన్ చేరుకున్నారు. 1991లో సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత ప్రధాని ఉక్రెయిన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ పర్యటనలో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంతో పాటు యుద్ధ సంక్షోభంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.
పోలాండ్ నుండి కీవ్ చేరుకున్న ప్రధాని
పోలాండ్‌తో చర్చలు
పోలాండ్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ గురువారం ఉక్రెయిన్ చారిత్రక పర్యటనకు బయలుదేరారు. ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త మైలురాయిగా నిలిచిన పోలాండ్ పర్యటనను ప్రధాని నరేంద్ర మోదీ ఉత్పాదకతతో ముగించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం తెలిపారు. నాలుగు దశాబ్దాల తర్వాత ప్రధానమంత్రి ఈ అత్యున్నత స్థాయి పర్యటన భారతదేశం-పోలాండ్ సంబంధాలను విస్తృతం చేస్తుంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆహ్వానం మేరకు ఉక్రెయిన్‌లో పర్యటిస్తున్న మోదీ, ప్రస్తుతం కొనసాగుతున్న వివాదానికి శాంతియుత పరిష్కారంపై ఉక్రెయిన్ అధినేతతో తన అభిప్రాయాలను పంచుకుంటానని చెప్పారు.
10 గంటల రైలు ప్రయాణం
ప్రధాని మోదీ కట్టుదిట్టమైన భద్రత మధ్య రైలులో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు ప్రయాణించారు. ప్రయాణానికి దాదాపు 10 గంటల సమయం పట్టింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని భారత్ ఇంకా ఖండించలేదు.చర్చలు, దౌత్యం ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని పిలుపునిస్తోంది. వార్సా నుంచి బయలుదేరే ముందు మోదీ మాట్లాడుతూ.. పోలాండ్ పర్యటన ప్రత్యేకమైందని అన్నారు. దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని పోలిష్ గడ్డపై అడుగు పెట్టారని ప్రధాని మోదీ వార్సా పర్యటన ముగింపు సందర్భంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ప్రధాని మోదీ తన రెండు దేశాల పర్యటనలో భాగంగా బుధవారం పోలాండ్ చేరుకున్నారు. 45 ఏళ్ల తరువాత ఈ దేశంలో ఓ భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.