Loading...
PM Modi: నవంబర్‌ 16న ఫిలిప్పీన్స్‌కు ప్రధాని మోదీ.. మూడు రోజుల పర్యటన
నవంబర్‌ 16న ఫిలిప్పీన్స్‌కు ప్రధాని మోదీ.. మూడు రోజుల పర్యటన

PM Modi: నవంబర్‌ 16న ఫిలిప్పీన్స్‌కు ప్రధాని మోదీ.. మూడు రోజుల పర్యటన

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16వ తేదీన ఫిలిప్పీన్స్‌లో పర్యటించనున్నారు. ఆ దేశ రాజధాని మనీలాలో నవంబర్‌ 16 నుంచి 18వ తేదీ వరకు జరిగే 21వ ఆసియాన్‌-భారత్‌ వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆసియాన్‌ సభ్య దేశాల అగ్రనేతలతో మోదీ సమావేశమై కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పదకొండు దేశాలతో కూడిన ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య (ఆసియాన్‌) ప్రస్తుతం ఈ ప్రాంతంలో ప్రభావశీలమైన కూటమిగా ఎదిగింది. ఈ నేపథ్యంలో భారత్‌, ఆసియాన్‌ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు 

సమావేశాల మధ్యలో ఇతర దేశాల నాయకులతో ద్వైపాక్షిక చర్చలు

మోదీ మనీలా పర్యటనలో భాగంగా ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్‌ వివిధ దేశాల నుంచి హాజరయ్యే ప్రముఖ నేతలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేయనున్నారు.

అనంతరం మరుసటి రోజు ఆసియాన్‌-భారత్‌ శిఖరాగ్ర సదస్సుతో పాటు తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం జరగనుంది.

ఈ సమావేశాల మధ్యలో ప్రధాని మోదీ ఇతర దేశాల నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

పర్యటనకు సంబంధించిన వివరాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ADVERTISEMENT