Page Loader
Australia: ఆస్ట్రేలియాలో కర్నాల్ విద్యార్థి హత్య.. ఇద్దరు యువకుల కోసం మెల్‌బోర్న్ పోలీసుల గాలింపు 
ఆస్ట్రేలియాలో కర్నాల్ విద్యార్థి హత్య.. ఇద్దరు యువకుల కోసం మెల్‌బోర్న్ పోలీసుల గాలింపు

Australia: ఆస్ట్రేలియాలో కర్నాల్ విద్యార్థి హత్య.. ఇద్దరు యువకుల కోసం మెల్‌బోర్న్ పోలీసుల గాలింపు 

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2024
10:21 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియా మెల్‌బోర్న్‌లో భారతీయ సంతతికి చెందిన విద్యార్థిని ఆదివారం ఉదయం కత్తితో పొడిచి చంపిన హర్యానాకు చెందిన ఇద్దరు సోదరుల కోసం ఆస్ట్రేలియా పోలీసులు వెతుకుతున్నారు. మరణించిన ఎంటెక్ విద్యార్థి నవజీత్ సంధు(22)హర్యానాలోని కర్నాల్ నివాసి .అద్దె విషయంలో భారతీయ విద్యార్థుల మధ్య తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకునేందుకు సంధు ప్రయత్నించినట్లు సమాచారం. హత్య కేసులో సోదరులు అభిజీత్ (26), రాబిన్ గార్టన్ (27) కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మీడియా నివేదికలో, హోమిసైడ్ స్క్వాడ్‌కు చెందిన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ డీన్ థామస్, నిందితులు పార్టీలో మద్యంసేవించినట్లు తెలిపారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో వివాదం చెలరేగిందని ఇన్‌స్పెక్టర్ థామస్ తెలిపారు. ఈ క్రమంలో నిందితులిద్దరు నవజీత్ పై కత్తితో దాడి చేశారని తెలిపారు.

Details

అద్దెకు సంబంధించి వివాదం

ఇదిలావుండగా,భారత్‌లో ఉన్న నవజీత్ సంధు మేనమామ యశ్వీర్ తెలిపిన వివరాల ప్రకారం, హర్యానా,కర్నాల్‌లోని గగ్సినా గ్రామానికి చెందిన నవజీత్‌ స్టడీ వీసాపై ఆస్ట్రేలియా వెళ్లాడు. కర్నాల్‌ కి చెందిన మరో ఇద్దరు యువకులు కూడా చదువు​కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు.నవజీత్ స్నేహితుడు శ్రవణ్ మరో ఇద్దరితో కలిసి ఒకే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. ఇటీవల,శ్రవణ్ అక్కడి నుండి వేరే ప్రాంతానికి మారాలని నిర్ణయించుకున్నాడు.

Details

నవజీత్‌ కారులో సామాన్లు తరలించే సమయంలో గొడవ

ఈ విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో నవజీత్‌ కారులో సామాన్లు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులు మళ్లీ శ్రవణ్‌తో గొడవకు దిగారు. వారిని నివారించినందుకు గాను నవజీత్‌పై కత్తితో దాడిచేశారు. ఛాతీపై తీవ్రమైన కత్తిపోటు గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో శ్రవణ్‌ కూడా గాయపడ్డాడు.నవజీత్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావడానికి భారత ప్రభుత్వం సహకరించాలని నవజీత్ సంధు మేనమామ యశ్వీర్ విజ్ఞప్తి చేశారు.