Page Loader
US Visas: భారతీయ విద్యార్థులకు వీసా జారీలో అమెరికా ఎంబసీ రికార్డు 
US Visas: భారతీయ విద్యార్థులకు వీసా జారీలో అమెరికా ఎంబసీ రికార్డు

US Visas: భారతీయ విద్యార్థులకు వీసా జారీలో అమెరికా ఎంబసీ రికార్డు 

వ్రాసిన వారు Stalin
Nov 29, 2023
11:52 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ విదార్థులకు అమెరికా వీసాల(US Visas) జారీలో యూఎస్ ఎంబసీ, దాని కాన్సులేట్‌లు సరికొత్త రికార్డు సృష్టించాయి. అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 మధ్య కాలంలో 1,40,000 కంటే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులకు వీసాలను జారీ చేసినట్లు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. అమెరికా వీసాల జారీలో ఇదే ఆల్-టైమ్ రికార్డ్‌ కావడం గమనార్హం. అలాగే అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 మధ్య ప్రపంచవ్యాప్తంగా 10 మిలియన్లకు పైగా నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాలను రికార్డు స్థాయిలో అమెరికా జారీ చేసింది. యూఎస్ ఎంబసీలు, కాన్సులేట్‌లలో సగం మంది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం గతం కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు.

వీసా

6లక్షలకు పైగా విద్యార్థి వీసాలు జారీ

అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లు ప్రపంచవ్యాప్తంగా ఏడాది కాలంలో 6లక్షల కంటే ఎక్కువ విద్యార్థి వీసాలను జారీ చేశాయి. 2017 ఆర్థిక సంవత్సరం నుంచి వీసాల జారీ ఇదే అత్యధికం కావడం గమనార్హం. గత ఏడాది 1.2 మిలియన్లకు పైగా భారతీయులు యూఎస్‌ని సందర్శించారు. ఇది ప్రపంచంలోనే బలమైన ప్రయాణ భాగస్వామ్యాల్లో ఒకటని అమెరికా ఎంబసీ, కాన్సులేట్‌లు తెలిపాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వీసా దరఖాస్తుదారులలో భారతీయులు 10 శాతానికి పైగా ఉన్నారు. భారతీయు చేసుకున్న దరఖాస్తుల్లో 20 శాతం విద్యార్థి వీసాలు ఉన్నాయి.