Page Loader
New York: న్యూయార్క్‌ వాల్‌స్ట్రీట్‌ను ఊపేసిన భారతీయ పెళ్లి బరాత్‌
న్యూయార్క్‌ వాల్‌స్ట్రీట్‌ను ఊపేసిన భారతీయ పెళ్లి బరాత్‌

New York: న్యూయార్క్‌ వాల్‌స్ట్రీట్‌ను ఊపేసిన భారతీయ పెళ్లి బరాత్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2025
09:54 am

ఈ వార్తాకథనం ఏంటి

న్యూయార్క్‌లోని ప్రఖ్యాత 'వాల్‌స్ట్రీట్‌' ఇటీవల ఓ అద్భుత దృశ్యానికి వేదికైంది. ఓ భారతీయ జంట పెళ్లి బరాత్‌తో ఆ ప్రాంతం మొత్తం ఉత్సాహవాతావరణంగా మారిపోయింది. సుమారు 400 మంది ఆ బరాత్‌లో పాల్గొని బాలీవుడ్‌ పాటలపై ఉత్సాహంగా నృత్యం చేశారు. రంగురంగుల దుస్తులు ధరించి ఉత్సాహంగా కదిలిన బంధువులు, మిత్రులు అందరినీ ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో వధూవరులు కూడా స్టెప్పులు వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫైనాన్షియల్‌ హబ్ వేదికగా మారడమే కాకుండా, ఆ ప్రాంతం నృత్యభూమిగా మారడమే విశేషం.

Details

ఓ నృత్య వేదికగా ఫైనాన్షియల్‌ హబ్‌

ఈ సంఘటనపై పలువురు స్పందిస్తూ ఫైనాన్షియల్‌ హబ్‌ కాస్త భారతీయ సంప్రదాయ వేడుకలకు వేదిక కావడం ఎంతో అరుదైన దృశ్యమని, ఇలాంటి ఆనందం, ఉత్సాహం భారతీయుల వల్లనే సాధ్యమని చెప్పారు. ఈ దృశ్యాలు కొద్దిసేపటికే ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో వైరలయ్యాయి. ఈ వేడుకను నిర్వహించిన డీజే ఏజే కూడా స్పందిస్తూ, వాల్‌స్ట్రీట్‌లో ఇలాంటి వేడుక జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. జీవితంలో ఒక్కోసారి ఇలాంటి అద్భుతాలు చోటుచేసుకుంటాయంటూ తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నారు.