Loading...
UAE :యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి.. మృతుల్లో భారతీయులు
యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి.. మృతుల్లో భారతీయులు

UAE :యూఏఈలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి.. మృతుల్లో భారతీయులు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 25, 2026
08:05 am

ఈ వార్తాకథనం ఏంటి

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాస్ అల్ ఖైమాలో బస్సు, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల్లో భారతీయులు కూడా ఉన్నట్లు దుబాయ్‌లోని భారత కాన్సులేట్ వెల్లడించింది. అయితే, మృతులు ఏయే రాష్ట్రాలకు చెందిన వారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. సాంకేతిక సమస్య కారణంగా ఓ ట్రక్కు రోడ్డుపైనే నిలిచిపోయింది. అదే సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి ఆ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

వివరాలు 

ప్రమాదంపై దుబాయ్‌లోని భారత కాన్సులేట్ తీవ్ర విచారం

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

ఈ ప్రమాదంపై దుబాయ్‌లోని భారత కాన్సులేట్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

బాధితుల కుటుంబ సభ్యులను ఇప్పటికే సంప్రదించినట్లు వెల్లడించింది.

వారికి అవసరమైన సహాయం అందించేందుకు స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది.

బాధిత కుటుంబాలు, ఇతర వివరాల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 971 800-46342ను సంప్రదించవచ్చని పేర్కొంది.

వివరాలు 

హూతీల దాడి.. ఇద్దరు భారతీయులకు గాయాలు

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని ఫైనాన్షియల్ సెంటర్‌లో మరో దాడి కలకలం రేపింది.

అక్కడి ఓ ఎత్తైన భవనాన్ని లక్ష్యంగా చేసుకుని యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో ఇద్దరు భారతీయులతో పాటు మొత్తం 11 మంది గాయపడినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు.

గాయపడిన వారిలో ఇద్దరు సౌదీ పౌరులు, ముగ్గురు నేపాలీలు, నలుగురు ఈజిప్టు దేశస్థులు ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు.

అయితే, గాయపడిన భారతీయులు ఎవరనే వివరాలతో పాటు వారికి తగిలిన గాయాల తీవ్రతపై ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.

ADVERTISEMENT