Page Loader
ఇజ్రాయెల్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలి.. ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ హెచ్చరిక
ఇజ్రాయెల్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలి.. ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ హెచ్చరిక

ఇజ్రాయెల్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలి.. ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ హెచ్చరిక

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2024
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు భారతీయ విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌లో ఉన్న భారత పౌరులకు మన రాయబార కార్యాలయం తాజా అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు అప్రమత్తంగా ఉంటూ కచ్చితంగా భద్రతా నియమాలను పాటించాలని సూచించింది. భారతీయులు అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండి, సురక్షిత ప్రదేశాలకు దగ్గర్లో ఉండాలని పేర్కొంది. ఇప్పటికే దేశ పౌరుల భద్రత కోసం ఇజ్రాయెల్ అధికారులతో సమీక్షలు జరుపుతున్నట్లు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.

Details

ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం 

హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా గత మంగళవారం ఇరాన్‌లో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఇక హమాస్ సైనిక విభాగాధిపతి మహమ్మద్ డెయిఫ్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ తాజాగా వెల్లడించింది. ఈ వరుస పరిణామాలతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరాన్, ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉంది. దీంతో ఐడీఎఫ్ అప్రమత్తమైంది. టెల్ అవీవ్‌కు అండగా ఉండేందుకు అమెరికా నౌకలు, ఫైటర్ జెట్లను పంపిస్తోంది.