LOADING...
America: యూఎస్‌లో అంతర్జాతీయ విద్యార్థిని అరెస్ట్‌.. బేడీలు వేసి తీసుకెళ్లిన వీడియో వైరల్
యూఎస్‌లో అంతర్జాతీయ విద్యార్థిని అరెస్ట్‌.. బేడీలు వేసి తీసుకెళ్లిన వీడియో వైరల్

America: యూఎస్‌లో అంతర్జాతీయ విద్యార్థిని అరెస్ట్‌.. బేడీలు వేసి తీసుకెళ్లిన వీడియో వైరల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 27, 2025
02:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా వలసలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా యూఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న ఇతర దేశాల ప్రజలను, వీసా గడువు ముగిసినా తిరిగి వెళ్లకుండా ఉంటున్న అంతర్జాతీయ విద్యార్థులను ఇమిగ్రేషన్ అధికారులు టార్గెట్ చేస్తున్నారు. అలాంటి వారిని అదుపులోకి తీసుకుని స్వదేశాలకు తరలిస్తున్నారు.

Details

వలసదారులపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్ ప్రభుత్వం

తాజాగా మాసాచుసెట్స్‌లో (Massachusetts) ఒక అంతర్జాతీయ విద్యార్థిని ఫెడరల్ అధికారులు అరెస్ట్ చేశారు. టఫ్ట్స్ యూనివర్సిటీలో (Tufts University) చదువుతున్న సదరు విదేశీ విద్యార్థిని మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుని తరలించినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధులు మూడు కార్లలో విద్యార్థిని ఉంటున్న ఆఫ్ క్యాంపస్ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. అక్కడ విద్యార్థినిని చుట్టుముట్టి చేతులు వెనక్కి విరిచి బేడీలు వేసి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఈ విద్యార్థిని వీసాను రద్దు చేసినట్లు సమాచారం. బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ట్రంప్ ప్రభుత్వం వలసదారులపై మరింత కఠినంగా వ్యవహరించే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విద్యార్థినికి బేడీలు వేసిన దృశ్యం