Loading...
Bahrain: బహ్రెయిన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్‌ దాడి.. ఆరు డ్రోన్లతో విరుచుకుపడ్డ ఐఆర్‌జీసీ!
బహ్రెయిన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్‌ దాడి.. ఆరు డ్రోన్లతో విరుచుకుపడ్డ ఐఆర్‌జీసీ!

Bahrain: బహ్రెయిన్‌లో అమెరికా స్థావరంపై ఇరాన్‌ దాడి.. ఆరు డ్రోన్లతో విరుచుకుపడ్డ ఐఆర్‌జీసీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2026
04:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

గల్ఫ్‌ దేశమైన బహ్రెయిన్‌లో పేలుళ్లు, సైరన్లతో కలకలం రేగింది. అల్‌-రిఫా హెలికాప్టర్‌ స్థావరం వద్ద ఉన్న అమెరికా సైనిక స్థావరంపై తాము దాడి చేసినట్లు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (IRGC) ఆదివారం ప్రకటించింది. ఈ లక్ష్యంపై ఆరు డ్రోన్లను ప్రయోగించినట్లు వెల్లడించింది. అమెరికా నుంచి ఎలాంటి దురాక్రమణ జరిగినా.. అంతకంటే కఠినమైన, తీవ్ర స్థాయిలో ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది.

వివరాలు

బహ్రెయిన్‌లో ప్రజలకు హెచ్చరికలు

ఇరాన్‌ ప్రకటనతో అప్రమత్తమైన బహ్రెయిన్‌ ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వరుస పేలుళ్లు, సైరన్ల శబ్దాలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

ఎత్తైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.

వివరాలు

అమెరికా మరో తప్పు చేస్తే పరిస్థితులు చేయి దాటుతాయి: ఘాలిబాఫ్

ఇరాన్‌పై దాడులు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న ప్రకటనలపై ఆ దేశ పార్లమెంట్‌ స్పీకర్‌ ఘాలిబాఫ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమెరికా మరో తప్పు చేస్తే పరిస్థితులు చేయి దాటుతాయని హెచ్చరించారు.

''అమెరికా చర్చల మార్గాన్ని ఎంచుకుంటుందా? యుద్ధ మార్గాన్ని ఎంచుకుంటుందా? అన్నది మాకు ముఖ్యం కాదు. మేం విధించిన ఏడు షరతులను అంగీకరిస్తేనే ఆ దేశంతో ఒప్పందానికి మార్గం తెరుచుకుంటుంది.

అలా కాకుండా మరోసారి దాడులకు పాల్పడితే.. శక్తిమంతమైన ఇరాన్‌ సాయుధ దళాలు యుద్ధ క్షేత్రాన్ని నిర్దేశిస్తాయి'' అని ఘాలిబాఫ్‌ స్పష్టం చేశారు.

ADVERTISEMENT