Iran: హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులు..
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్నిపొడిగించిన కొన్ని గంటలకే కీలకపరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధిలో ఒక సరుకు నౌకపై ఇరాన్ దాడికి దిగింది.ఈఘటనలో నౌక దెబ్బతిన్నట్లు సమాచారం. ఇరాన్ విప్లవ గార్డు దళాలు హర్మూజ్ జలసంధిలో ఆ నౌకపై కాల్పులు జరిపినట్లు యునైటెడ్ కింగ్డమ్ సముద్ర వాణిజ్య పర్యవేక్షణ కేంద్రం తెలిపింది. కాల్పులకు ముందు గన్‌బోట్ నుంచి ఎలాంటి హెచ్చరికలు ఇవ్వలేదని వెల్లడించింది. ఈకాల్పుల్లో నౌకకు నష్టం జరిగినప్పటికీ,సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. ఈదాడిని ఇరాన్ మీడియా కూడా ధృవీకరించింది.అయితే,దాడికి కారణాలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇటీవల ఇరాన్‌కు చెందిన ఒక వాణిజ్యనౌకను అమెరికాదళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తాజా దాడి ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింతగా పెంచింది.
వివరాలు
అలా చేస్తే.. చర్చలకు సిద్ధం: ఇరాన్
అమెరికా-ఇరాన్ మధ్య చర్చల విషయంలో ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది.
ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ ప్రతినిధి అమీర్ సయీద్ ఇరావానీ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికాతో రెండో విడత చర్చలకు తమ దేశం సిద్ధంగా ఉందని తెలిపారు. అయితే, హర్మూజ్ ప్రాంతంలో తమ నౌకలపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని తొలగించాలని షరతు విధించారు.
తమ నౌకలను దిగ్బంధించడం ద్వారా అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇరావానీ ఆరోపించారు.
ఈవిషయాన్ని ఇప్పటికే అమెరికా దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.
దిగ్బంధనం ఎత్తివేయడానికి అమెరికా సిద్ధంగా ఉన్నట్లు తమకు కొన్నిసంకేతాలు అందాయని వెల్లడించారు.
దిగ్బంధనం తొలగిన వెంటనే ఇస్లామాబాద్‌లో చర్చలు ప్రారంభమవుతాయని తెలిపారు.
అదే సమయంలో చర్చల బదులు యుద్ధం కోరుకుంటే,అందుకు ఇరాన్ కూడా సిద్ధంగా ఉందని హెచ్చరించారు.