Loading...
Underground 'Missile City': అమెరికాకు ఇరాన్‌ మరో షాక్‌.. ఒకేసారి రెండు క్షిపణులు ప్రయోగించే లాంచర్‌!

Underground 'Missile City': అమెరికాకు ఇరాన్‌ మరో షాక్‌.. ఒకేసారి రెండు క్షిపణులు ప్రయోగించే లాంచర్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 23, 2026
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్‌ సైన్యం తాజాగా ఓ సంచలన వీడియోను విడుదల చేసింది. ఇందులో ఒకేసారి రెండు క్షిపణులను ప్రయోగించగల సరికొత్త లాంచర్‌ను ప్రదర్శించింది. ద్రవ ఇంధనంతో పనిచేసే ఈ క్షిపణి ప్రయోగ వ్యవస్థను ఇరాన్‌ సైన్యం బహిరంగంగా చూపించడం ఇదే తొలిసారి. ఈ వీడియో ద్వారా తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటే ప్రయత్నం చేసింది.

వివరాలు 

యాంటీ షిప్‌ క్షిపణులు, సముద్ర మందుపాతరలు సహా పలు రకాల ఆయుధాలు 

వీడియోలో ఇరాన్‌కు చెందిన భూగర్భ క్షిపణి కేంద్రం (మిసైల్‌ సిటీ)కు సంబంధించిన దృశ్యాలు కనిపించాయి.

ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) కమాండర్లు ఓ వాహనంలో సొరంగ మార్గం గుండా ప్రయాణిస్తూ అక్కడి ఆయుధాలను పరిశీలిస్తున్నట్లు ఫుటేజీలో ఉంది.

యాంటీ షిప్‌ క్షిపణులు, సముద్ర మందుపాతరలు సహా పలు రకాల ఆయుధాలను అక్కడ భద్రపరిచినట్లు కనిపిస్తోంది.

మరో వీడియోలోనూ వివిధ రకాల ఆయుధాలను ప్రదర్శించారు. ఇరాన్‌కు ఇలాంటి భూగర్భ క్షిపణి కేంద్రాలు కొత్తేమీ కాదు.

గతంలోనూ కొన్ని కేంద్రాలకు సంబంధించిన దృశ్యాలను ఆ దేశం ప్రపంచానికి వెల్లడించింది.

వివరాలు 

అమెరికా దాడులపై ఇరాన్‌ ఎదురుదాడి సంకేతాలు!

ఇరాన్‌తో జరిగిన యుద్ధంలో ఆ దేశ అణు, క్షిపణి వ్యవస్థలను పూర్తిగా దెబ్బతీశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు.

అవసరమైతే మరోసారి టెహ్రాన్‌పై తీవ్రస్థాయిలో దాడులు చేస్తామని హెచ్చరించారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్‌ సైన్యం విడుదల చేసిన తాజా వీడియో ప్రాధాన్యం సంతరించుకుంది.

తమ ఆయుధ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేస్తున్న అమెరికాకు ఈ ప్రదర్శనతో గట్టి సంకేతాలు పంపింది.

అమెరికా సైన్యంతో పాటు దాని మిత్రదేశాలను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్న ఆయుధాలు తమ వద్ద ఇంకా ఉన్నాయని ఇరాన్‌ చెప్పకనే చెబుతోంది.

ముఖ్యంగా భూమికి చాలా లోతులో నిర్మించిన భూగర్భ కేంద్రాల్లో ఆయుధాలను భద్రపరిచినట్లు ఈ వీడియోలు సూచిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

అమెరికా దాడులపై ఇరాన్‌ ఎదురుదాడి సంకేతాలు!

అవి లోతైన ప్రాంతాల్లో ఉండటంతో వాటిని గుర్తించి పూర్తిగా ధ్వంసం చేయడం అమెరికా బలగాలకు సవాలుగా మారవచ్చనే అంచనాలున్నాయి.

మరోవైపు, గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులకు దిగితే వాటిని అడ్డుకోవడం అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థలకు మరింత కష్టతరమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకేసారి రెండు క్షిపణులను ప్రయోగించగల లాంచర్‌ ప్రదర్శనతో ఇరాన్‌ తన సైనిక సామర్థ్యంపై కొత్త చర్చకు తెరలేపింది.

ADVERTISEMENT

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇరాన్ ఆబ్సర్వర్ చేసిన ట్వీట్ 

ADVERTISEMENT