Strait of Hormuz: హర్మూజ్ మీ క్యాసినో కాదు.. ట్రంప్‌కు ఇరాన్ నేత ఘాటు హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
లెబనాన్‌లోని హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులు చేయకుండా అడ్డుకోవాలని, లేనిపక్షంలో ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో సైనిక చర్యలు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ నుంచి గట్టి ప్రతిస్పందన వచ్చింది. ఇరాన్ పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ ఛైర్మన్ ఇబ్రహీం అజీజి అమెరికా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో స్పందించిన ఆయన, ''మీరు బెదిరింపులు చేస్తారు.. మేము చర్యలతో సమాధానం ఇస్తాం. హర్మూజ్ జలసంధి మీ క్యాసినో కాదు. అది సముద్ర దొంగల స్థావరం కూడా కాదు. ఆ ప్రాంతానికి సంబంధించిన ఏ నిర్ణయం అయినా ఇరాన్ ప్రజలు, దేశ రక్షణ బలగాల ఆధీనంలోనే ఉంటుంది'' అని స్పష్టం చేశారు.
వివరాలు
హర్మూజ్ మూసివేతపై ఉద్రిక్తత
లెబనాన్‌పై ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న దాడులు,అలాగే గత ఒప్పందాల్లోని నిబంధనలను పట్టించుకోకపోవడాన్ని కారణంగా చూపుతూ హర్మూజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలకు దారితీసింది. ఇరాన్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్, 60 రోజుల వ్యవధిలో ఇరాన్‌తో తుది ఒప్పందం కుదరకపోతే హర్మూజ్ మార్గాన్ని వినియోగించే నౌకలపై టోల్ వసూలు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. పశ్చిమాసియా దేశాలకు అమెరికా అందిస్తున్న భద్రతా సేవలకు ప్రతిఫలంగా ఆ మొత్తాన్ని తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
నెమ్మదించిన నౌకల రాకపోకలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గినట్లు తాజా సమాచారం వెల్లడిస్తోంది. మారిటైమ్ ట్రాకింగ్ డేటా సంస్థ విండ్‌వర్డ్ వివరాల ప్రకారం,ఒక రోజు ముందు 35 నౌకలు హర్మూజ్ మార్గం గుండా ప్రయాణించగా, ఆదివారం మాత్రం కేవలం 12 నౌకలు మాత్రమే దాటాయి. అలాగే కొన్ని నౌకలు తమ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (AIS)ను నిలిపివేసి ప్రయాణించినట్లు సంస్థ వెల్లడించింది. దీంతో ఆ ప్రాంతంలో భద్రతా పరిస్థితులపై మరింత ఆందోళన వ్యక్తమవుతోంది.