Iran on Strait Of Hormuz: హర్మూజ్‌పై కీలక ప్రకటన.. జలసంధిని తెరిచిన ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ ఆసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించింది. అన్ని వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతిస్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి తెలిపారు. లెబనాన్‌తో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నంతకాలం హర్మూజ్ జలసంధి తెరిచి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
వివరాలు
అమెరికా-ఇరాన్ మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు
ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య 10 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం అధికారికంగా ప్రకటించారు. అమెరికా-ఇరాన్ మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలు కూడా ఈ పరిణామంతో పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లెబనాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ అంగీకారం ఈ దిశగా కీలకంగా మారే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.