Page Loader
Iraq-social Media Star-Murder: ఇరాక్ లో దారుణం...సోషల్ మీడియా స్టార్ లేడీ దారుణ హత్య
దారుణ హత్యకు గురైన ఇరాక్​లో సోషల్​ మీడియా స్టార్​ ఉమ్​ పహాద్​ (సఫాదీ) ఫైల్​ ఫొటో

Iraq-social Media Star-Murder: ఇరాక్ లో దారుణం...సోషల్ మీడియా స్టార్ లేడీ దారుణ హత్య

వ్రాసిన వారు Stalin
Apr 28, 2024
03:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాక్(Iraq)లో దారుణం చోటుచేసుకుంది. ఇరాక్ లో సోషల్ మీడియా(Social Media)స్టార్ గా పేరుపొందిన సఫాదీ(Safaadi)దారుణ హత్య(Murder)కు గురైంది. బాగ్దాద్(Bagdhad)లోని ఆమె ఇంటి వద్ద గుర్తు తెలియని ఓ వ్యక్తి బైక్ పై వచ్చి ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు(Gun Fire)జరిపాడు. టిక్ టాక్(Tik Tak)లో ఫహద్ పేరుతో ప్రజాదరణ పొందిన ఈ సోషల్ మీడియా స్టార్ కు లక్షల మంది ఫాలో అవర్ లో ఉన్నారు. ఆమెపై కాల్పులు జరిపింది ఎవరన్నది ఇంకా తెలియ రాలేదు. తూర్పు బాగ్దాద్ లోని జయౌనా ప్రాంతంలో ఆమె నివాసం ఉంది. అక్కడకు బైక్ మీద వచ్చిన ఓ దుండగుడు ఆమెపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.

Social Media star-Murder-Iraq

గతంలో చేసిన వీడియోలతో ఆర్నెల్ల జైలుకు వెళ్లిన సఫాదీ

గతంలో సఫాదీ చేసిన పలు వీడియోలు వివాదాస్పదమయ్యాయి. నైతిక ఉల్లంఘన కింద ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష కూడా పడింది. జైలు నుంచి విడుదలైన తర్వాత పాప్ మ్యూజిక్ కు డ్యాన్సులు వేస్తూ వీడియోలు తీయడం స్టార్ట్ చేసింది. దీంతో ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇదిలా ఉండగా టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయిన నూర్ అల్సఫర్ అనే యువతి కూడా 2023లో దారుణ హత్యకు గురయ్యారు.