Page Loader
Israel-Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు..
ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు..

Israel-Iran: ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
07:50 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ముందస్తుగా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల నేపథ్యంలో టెహ్రాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. ఈ విషయాన్ని ఇరాన్‌కు చెందిన స్థానిక వార్తా సంస్థ ధృవీకరించింది. అమెరికా ఈ దాడులపై ముందు నుంచే హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి దాడులకు పాల్పడకూడదని ఇజ్రాయెల్‌ను సూచించింది. అయితే అమెరికా హెచ్చరికలను నిర్లక్ష్యం చేస్తూ, టెల్‌అవీవ్‌ ఈ దాడులకు దిగినట్లు స్పష్టమవుతోంది. ఇజ్రాయెల్‌ జరిపిన ఈ వైమానిక దాడుల్లో అమెరికా పాత్ర ఏమీ లేదని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఇరాన్‌కు చెందిన అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే ప్రధాన లక్ష్యాలుగా మారినట్టు సమాచారం.

వివరాలు 

దేశమంతటా అత్యవసర పరిస్థితి

ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ఎలాంటి ప్రతిదాడికి దిగొచ్చని అంచనాలతో, టెల్‌అవీవ్‌ ప్రభుత్వ యంత్రాంగం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి యోవావ్‌ కాట్జ్‌ వెల్లడించారు. ఇరాన్‌ తమ దేశ పౌరులను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు లేదా డ్రోన్‌లతో దాడులకు పాల్పడే అవకాశాన్ని ఆయన ఊహించారు. ఈ నేపథ్యంలో దేశమంతటా అత్యవసర పరిస్థితిని అమలులోకి తీసుకురావాలని ఆయన అధికారిక ఉత్తర్వులపై సంతకం చేశారు.