
Hezbollah Israel Tension: హిజ్బుల్లాపై ఐడీఎఫ్ 1500 కోట్ల రూపాయల విలువైన క్షిపణుల వర్షం
ఈ వార్తాకథనం ఏంటి
లెబనాన్‌లో ఇజ్రాయెల్ సైన్యం తీవ్ర విధ్వంసం సృష్టిస్తూ, హిజ్బుల్లా తీవ్ర సంక్షోభంలో ఉందని సంకేతాలిస్తున్నది.
గాజాలో హమాస్ ఎదుర్కొంటున్న పరిస్థితి, హిజ్బుల్లాకు కూడా వర్తించవచ్చని భావిస్తున్నారు.
కేవలం నాలుగు రోజుల ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ హిజ్బుల్లా 90 శాతం నాయకత్వాన్ని తొలగించడమే కాకుండా, దాని సైనిక బలాన్ని సగం నాశనం చేసింది.
ఒక్కరోజులోనే ఇజ్రాయెల్ సైన్యం (IDF) హిజ్బుల్లాపై 1500 కోట్ల రూపాయల విలువైన క్షిపణుల దాడి జరిపి, సాంకేతికంగా ముందంజ వేశారు.
ఈ దాడితో హిజ్బుల్లా అగ్రనాయకత్వం కుదేలైంది.ఆపరేషన్ నార్తర్న్ యారో ద్వారా హిజ్బుల్లా సైనిక మౌలిక సదుపాయాలలో సగం నాశనం అయిందని ఇజ్రాయెల్, అమెరికా పేర్కొంటున్నాయి.
వివరాలు
హిజ్బుల్లా వద్ద సుమారు 70,000 రాకెట్లు మాత్రమే..
ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకారం, 1500 కోట్ల రూపాయల విలువైన క్షిపణులను 24 గంటల్లోనే ప్రయోగించడం వల్ల, హిజ్బుల్లా అగ్ర నాయకత్వంలో ముగ్గురు మాత్రమే మిగిలారు: హసన్ నస్రల్లా, దక్షిణ ఫ్రంట్ కమాండర్ అలీ కరాకి, బదర్ యూనిట్ నాయకుడు అబూ అలీ.
ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఇప్పుడు హిజ్బుల్లా నాయకత్వంలో ఉన్నారు, మిగిలిన 18 మంది తొలగించబడ్డారు.
హిజ్బుల్లా సగం సైనిక శక్తిని నాశనం చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది.మూడు రోజుల క్రితం వరకు హిజ్బుల్లా వద్ద 1,40,000 రాకెట్లు, క్షిపణులు ఉండగా,ఇజ్రాయెల్ దాడుల్లో సగం అంటే 70,000 క్షిపణులు దగ్ధమయ్యాయి.
ఇప్పుడు హిజ్బుల్లా వద్ద సుమారు 70,000 రాకెట్లు మాత్రమే మిగిలాయి.దీనితోపాటు,హిజ్బుల్లా రాకెట్ లాంచ్ ప్యాడ్స్ 50 శాతం,స్థావరాలు 60శాతం ధ్వంసమయ్యాయి.
వివరాలు
లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై మరింత దాడులు
ఇజ్రాయెల్ దాడి తదుపరి దశలో లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై మరింత దాడులు జరగవచ్చని భావిస్తున్నారు.
అందుకే, ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్‌ను ఖాళీ చేయాలని కోరుతూ కరపత్రాలను విడుదల చేసింది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ ప్రజలకు హెచ్చరిక చేస్తూ, క్షిపణులు, గన్‌పౌడర్‌ను ఉంచడానికి హిజ్బుల్లాను అనుమతిస్తే ఆ ఇళ్లు ధ్వంసం అవుతాయని సూచించారు.
కరపత్రాలు జారవిడిచిన తర్వాత లెబనాన్‌లో కలకలం రేగింది.
వివరాలు
క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయవద్దని హిజ్బుల్లా హెచ్చరిక
ఈ కరపత్రాల్లో క్యూఆర్ కోడ్ ఉండటంతో, ప్రజలు తమ ఫోన్‌ల ద్వారా స్కాన్ చేయాలని సూచించారు.
స్కాన్ చేసిన తర్వాత, వారు ఏ ప్రాంతం ఖాళీ చేయాలో తెలుసుకోవచ్చు. కానీ, హిజ్బుల్లా ఈ క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేయవద్దని హెచ్చరించింది, ఇది మొసాద్ కుట్రగా పేర్కొంది.
వారు ప్రజల ఫోన్‌లను హ్యాక్ చేసి సమాచారాన్ని పొందడానికి ఉపయోగించవచ్చని హిజ్బుల్లా పేర్కొంది.
ప్రజలు భయంతో దక్షిణ లెబనాన్‌ను వీడుతున్నారు. ఐడిఎఫ్ త్వరలో లెబనాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభించవచ్చని నమ్ముతారు.