Page Loader
Israel-Lebanon: హిజ్బుల్లాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్..1000 రాకెట్ లాంచర్ బారెల్స్ ధ్వంసం 
హిజ్బుల్లాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్

Israel-Lebanon: హిజ్బుల్లాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్..1000 రాకెట్ లాంచర్ బారెల్స్ ధ్వంసం 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 20, 2024
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

లెబనాన్‌లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల క్రమంలో పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు మరలా కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్‌ దళాలు హిజ్బుల్లాను లక్ష్యంగా తీసుకుని తీవ్రమైన దాడులు చేస్తున్నాయి. దక్షిణ లెబనాన్‌లో హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దళాలు భారీ దాడులు జరిపాయి. గురువారం మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు, ఇజ్రాయెల్‌ దళాలు 1000 రాకెట్లు ధ్వంసం చేసినట్లు వెల్లడించాయి. ఈ రాకెట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉండగా, వాటిని నిర్వీర్యం చేసినట్లు పేర్కొన్నారు. పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో హెజ్‌బొల్లా నేత హసన్‌ నస్రల్లా ప్రసంగించే సమయంలోనూ ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు కొనసాగాయి.

వివరాలు 

యుద్ధ విమానాలతో అమెరికా సిద్ధం 

అమెరికా యుద్ధ విమానాలతో సిద్ధంగా ఉంది. ఇజ్రాయెల్‌-హమాస్‌ ఘర్షణలు గత ఏడాది నుంచి కొనసాగుతుండగా, ఇప్పుడు ఈ ఘర్షణలు లెబనాన్‌కు విస్తరించనున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అమెరికా అప్రమత్తమై, తమ సైన్యాన్ని మరింతగా బలపరిచింది. హెజ్‌బొల్లా, ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించడంతో, యుద్ధ విమానాలు, నౌకలు, బలగాలను సిద్ధం చేసింది. పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల అనంతరం లెబనాన్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై, లెబనాన్‌ నుంచి ప్రయాణించే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలను తీసుకెళ్లడాన్ని నిషేధించింది. ఖతర్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా ఈ నిర్ణయాన్ని అనుసరించి, బీరుట్‌ విమానాల్లో పేజర్లు, వాకీటాకీలను నిషేధించింది.