
గాజాపై బాంబులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్.. ఇంటర్నెట్, మొబైల్ సేవలు బంద్
ఈ వార్తాకథనం ఏంటి
హమాస్ మిలిటెంట్ల లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) బాంబులు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది.
దాడులను మరింత ఉద్ధృతం చేస్తామని ఐడీఎఫ్ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి ప్రకటించారు.
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజాలో ఇంటర్నెట్, మొబైల్ సేవలను నిలిచిపోయాయి.
గాజాలోని అతిపెద్ద టెలికమ్యూనికేషన్ ప్రొవైడర్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో సేవలు పూర్తిగా నిలిచిపోయినట్లు ఐడీఎఫ్ పేర్కొంది.
గాజాలో కమ్యూనికేషన్, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగిట్లు అని పాలస్తీనా టెలికమ్యూనికేషన్స్ కంపెనీ (PALTEL) ట్వీట్ చేసింది.
పాలస్తీనా టెర్రరిస్టు గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్ అక్టోబర్ 7న ఆకస్మిక దాడి చేసింది. ఆ తర్వాత ఇరు వర్గాలు పరస్పరం చేసుకున్న దాడుల వల్ల దాదాపు 8,000 మంది చనిపోయారు.
హమాస్
కాల్పుల విరమణకు యూఎన్ చీఫ్ పిలుపు
గాజాపై కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి (UN) సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ శనివారం పిలుపునిచ్చారు.
ఈ పిలుపును ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) ఆమోదించింది.
గాజాలో కాల్పుల విరమణ పిలుపును ఇజ్రాయెల్ తిరస్కరించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి తీర్మానాన్ని హేయమైనదిగా అభివర్ణించారు.
కాల్పు విరమణ కోసం UN జనరల్ అసెంబ్లీ పిలుపును తాము పూర్తిగా తిరస్కరిస్తున్నామని పేర్కొన్నారు.
నాజీలు, ఐఎస్ఐఎస్ వలే హమాస్‌ను కూడా నిర్మూలించాలని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ అన్నారు.