Page Loader
Israel Hamas : ఇరుపక్షాల బందీలు విడుదల.. ఖతార్​,ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో మరోసారి విరమణ పొడిగింపు
ఖతార్​,ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో మరోసారి విరమణ పొడిగింపు

Israel Hamas : ఇరుపక్షాల బందీలు విడుదల.. ఖతార్​,ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో మరోసారి విరమణ పొడిగింపు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 30, 2023
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్-హమాస్ ఇరు పక్షాలు తమ బందీలను విడుదల చేశాయి. ఈ మేరకు 16 మంది ఇజ్రాయెల్, విదేశీ బందీలు బుధవారం గాజా నుంచి విముక్తి పొందారు. మరోవైపు 30 మంది పాలస్తీనియన్ మహిళలు, బాల ఖైదీలు గురువారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ జైళ్ల నుంచి విడుదలయ్యారు. మరోవైపు కాల్పుల విరమణ గడువు గురువారంతో ముగిసింది. అయితే మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఖతార్​, ఈజిప్ట్​ మరోసారి ఇరుదేశాలతో చర్చిస్తున్నట్లు సమాచారం. తాత్కాలిక కాల్పుల విరమణ ఆరో రోజు నేపథ్యంలో పాలస్తీనాకు చెందిన మరో 30 మంది ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. హమాస్‌ మిలిటెంట్లు బుధవారం సాయంత్రం మరో 16 మంది బందీలను వదిలేశారు.

details

విడుదలకు సిద్ధంగా ఉన్నాం : హమాస్ మంత్రి

అందులో 10 మంది మహిళలు, చిన్నారులు, నలుగురు థాయ్‌ పౌరులు, ఇద్దరు రష్యన్‌-ఇజ్రాయెల్‌ మహిళలు ఉన్నారని ఐడీఎఫ్ ప్రకటించింది. ఇప్పటివరకు హమాస్‌ మొత్తం 97మంది బందీలను వదిలిపెట్టింది. ఇజ్రాయెల్‌ 210 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి పొడిగించేందుకు మధ్యవర్తులు ప్రయత్నాలు కొనసాగిస్తుండటం గమనార్హం. తాము కూడా గట్టిగానే సంప్రదింపులు జరుపుతున్నట్లు హమాస్‌ సీనియర్‌ అధికారి, గాజా వైద్య శాఖ మాజీ మంత్రి బస్సెమ్‌ నయీం అన్నారు. విరమణ ఒప్పందం పొడిగింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్న వేళ, ఇజ్రాయెల్‌ జైళ్లలోని పాలస్తీనా ఖైదీలందరినీ విడుదల చేస్తే, తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్​ సైనికులను వదిలిపెట్టేందుకు రెడిగా ఉన్నామన్నారు.