Israel-Hamas : విడుదలకానున్న 13 మంది బందీలు.. అమల్లోకి ఇజ్రాయెల్ హమాస్ సంధి
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి తెరపడింది. బందీల(Hostages) విడుదల, కాల్పుల విరమణ కోసం గత కొద్దికాలంగా అంతర్జాతీయ సమాజం చేసిన విశ్వప్రయత్నాలు ఫలించాయి. ఈ మేరకు సంధి ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీంతో 13 మంది బందీలు విడుదల కానున్నారు. హమాస్‌తో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.దీంతో నేటి ఉదయం నుంచి రెండు వర్గాల మధ్య నాలుగు రోజుల పాటు కాల్పులు విరమణ అమల్లోకి వచ్చింది. ఇదే సమయంలో 50 మంది బందీలకు విముక్తి కలిగి అవకాశం ఉంది.ఈ క్రమంలోనే ఇజ్రాయెల్-హమాస్ మధ్య తాత్కాలిక కాల్పులు విరమణ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య సంధి అమల్లోకి వచ్చింది. సాయంత్రానికి బందీలను పరస్పరం అప్పగించుకోనున్నారు.
గాజాకు పెరగనున్న మానవతా సాయం
240 మంది బందీల్లో 50 మందిని హమాస్ విడిచిపెట్టనుంది.తమ జైళ్లలో ఉన్న పాలస్తీనా మహిళలు, చిన్నారులను ఇజ్రాయెల్ విడుదల చేస్తుందని ఖతార్ ప్రకటించింది.దీంతో గాజాకు మానవతా సాయం పెరగనుంది. కాల్పుల విరమణను పురస్కరించుకుని హమాస్ 13 మందిని విడుదల చేయనుంది. బందీల పేర్ల జాబితా ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆయా కుటుంబాలకు సమాచారం ఇచ్చింది. సంధి మొదలైన కొంత సేపటికే ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి.ఉదయం గాజాకు సమీపంలోని రెండు గ్రామాల్లో ఇజ్రాయెల్ ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ఈ క్రమంలోనే హమాస్ మిలిటెంట్లు రాకెట్ దాడి చేయొచ్చని హెచ్చరించింది. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన నిమిషాల వ్యవధిలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కానీ దాడి జరిగిందా లేదా అన్న స్పష్టత ఇంకా రాలేదు.