ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: పిల్లల తలలు నరికిన టెర్రరిస్టులు చిత్రాలు నిజమే.. మాకు తెలుసంటున్న బైడెన్
ఇజ్రాయెల్-హమాస్ ప్రత్యక్ష యుద్ధంపై అగ్రరాజ్యాధిపతి జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు దాడుల సమయంలో ఉగ్రవాదులు పిల్లల తలలను నరికిన ఫోటోలను తాను చూశానని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉగ్రవాదుల చేష్టలను ఆయన తీవ్రంగా ఖండించారు. హోలోకాస్ట్ ఘటన తర్వాత యూదులకు ఇది ప్రాణాంతకమైన రోజు అని అభివర్ణించారు. ఉగ్రవాదులు చిన్నారులను పొట్టనబెట్టుకుంటున్న చిత్రాలను చూస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు. ఇజ్రాయెల్‌లో పిల్లలపై హమాస్ ఉగ్ర దాడిని క్రూరత్వానికి ప్రతీకగా పేర్కొన్నారు. యూదులకు(jews)లకు శనివారం అత్యంత ఘోరమైన రోజుగా బైడెన్ ఆవేదన వ్యక్తం తెలిపారు. బాధిత దేశంతో కలిసి తాము పరిస్థితిని చాలా దగ్గరగా పర్యవేక్షిస్తూన్నామని, ప్రధాని నెతన్యాహుతో మాట్లాడామన్నారు.