Israel Hamas War : గాజా ఆస్పత్రి సమీపంలో భీకర యుద్ధం.. చిక్కుకున్న ప్రజలు
ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మరోసారి భీకర పోరుగా మారింది. గత కొన్ని రోజులుగా నెమ్మదించిన యుద్ధం, మరోసారి విజృంభించింది. ఈ క్రమంలోనే గాజా ఆస్పత్రి సమీపంలో భారీగా కాల్పులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజా ఆస్పత్రిలో విద్యుత్, ఆహారం, వైద్య సామాగ్రి అయిపోయిన తర్వాత వేలు ఆగిపోయాయి. యుద్ధం కారణంగా ఆస్పత్రిలోని రోగులు, వైద్యులు, పౌరులు తప్పించుకోలేక అక్కడే చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ దళాలు పౌరులు, రోగుల సురక్షిత తరలింపులో సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు హమాస్ే కమాండ్ సెంటర్లు అల్-షిఫాతో సహా ఆస్పత్రుల కింద ఉన్న బంకర్లలో దాక్కున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అక్కడ్నుంచి ఆయా మిలిటెంట్లు పనిచేస్తున్నట్లు సమాచారం.
ఇజ్రాయెల్ వాదనలను తిరస్కరించిన హమాస్
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్, హమాస్ మధ్య తీవ్రమైన పోరాటంతో ఇజ్రాయెల్ ఆరోగ్య సౌకర్యాలను గాజా బయట కొనసాగించేందుకు సహకరిస్తోంది. విద్యుత్ సౌకర్యం నిలిపివేత, ఇతర వైద్య చికిత్స సామాగ్రి లేమి కారణంగా ఆస్పత్రులో విధులు నిలిచిపోయాయి. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి, అల్-షిఫా, రెండో అతిపెద్ద ఆస్పత్రి అల్-ఖుద్స్ లో ఆపరేషన్లు సస్పెండ్ అయ్యాయి. గాజాకు ఉత్తరాన ఉన్న ఆస్పత్రి లోపల ఉన్నవారికి చికిత్సలు అందట్లేదని, ఈ మేరకు యాజమాన్యం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు శిశువులు, ఇతరులను ఖాళీ చేసేందుకు సహాయం చేస్తున్న ఇజ్రాయెల్ వాదనలను తిరస్కరించారు. ఆస్పత్రి వెలుపల తీవ్ర స్థాయిలో గొడవలు జరగడంతో రోగులు లోపలే చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.