తదుపరి వార్తా కథనం

Israel-US: అమెరికాపై విధించిన సుంకాలను రద్దు చేసిన ఇజ్రాయెల్!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Apr 02, 2025
10:11 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచంలోని పలు దేశాలపై విధించనున్న ప్రతీకార సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ సుంకాల ప్రకటన చేసే రోజును అమెరికా 'లిబరేషన్ డే'గా గుర్తిస్తామని ఇప్పటికే ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే.
పైగా వైట్ హౌస్ ప్రకారం, ఈ టారిఫ్‌లు వెంటనే అమల్లోకి వస్తాయి.
ఇజ్రాయెల్ కీలక నిర్ణయం
ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది.
అగ్రరాజ్యం నుంచి తమ దేశానికి వచ్చే దిగుమతులపై అన్ని రకాల సుంకాలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.