
Israel-Rapha-Hamas-Benjamin Nethanyahu:రఫాపై దండయాత్ర తప్పదు : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ
ఈ వార్తాకథనం ఏంటి
గత కొద్ది కాలంగా ఇజ్రాయెల్ (Israel)- హమాస్ (Hamas)మధ్య జరుగుతున్నయుద్ధంలో కాల్పుల విరమణ కోసం అమెరికా(America), ఈజిప్టు, ఖతార్ దేశాలు చర్చలు జరుపుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహూ (Benjamin Nethanyahu) సంచలన ప్రకటన చేశారు.
హమాస్ కు ఇంకా మిగిలి ఉన్న ప్రాంతమైన రఫాలో కచ్చితంగా దాడులు చేస్తామని ఆ నగరంలోకి తమ దళాలు అడుగుపెడతాయని స్పష్టం చేశారు.
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కుదరకపోయినా రఫాపై తమ దండయాత్ర ఆగదని తేల్చి చెప్పారు .
ఈ యుద్ధంలో పరిపూర్ణ విజయాన్ని సాధించాలనుకుంటున్నాం అని పేర్కొన్నారు.
Hamas-Benjamin Nethanyahu
రఫా పై దాడుల పట్ల అంతర్జాతీయంగా వ్యక్తమవుతున్న ఆందోళనలు
సంధి ప్రతిపాదనలను ఖతార్, ఈజిప్ట్, అమెరికా దేశాలకు చెందిన ప్రతినిధులు పంపినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఈ ఒప్పందంలో భాగంగా హమాస్ చెరలో ఉన్న కొంతమంది బందీలను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాల్పుల విరమణపై ఓవైపు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఇజ్రాయెల్ రహానగరంపై దాడులు ఆపకపోవడం గమనార్హం.
కాగా రఫా నగరంపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల పట్ల అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.