Page Loader
Donald Trump: ట్రంప్‌కు గోల్డెన్ పేజర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన ఇజ్రాయెల్‌ ప్రధాని
ట్రంప్‌కు గోల్డెన్ పేజర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన ఇజ్రాయెల్‌ ప్రధాని

Donald Trump: ట్రంప్‌కు గోల్డెన్ పేజర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన ఇజ్రాయెల్‌ ప్రధాని

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2025
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌-గాజా యుద్ధం తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను కలుసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా, నెతన్యాహు ట్రంప్‌కు బహుమతిగా ఒక బంగారు పేజర్‌ను అందజేశారు. గత సంవత్సరం లెబనాన్‌, సిరియాలపై జరిగిన తీవ్రమైన పేజర్‌ దాడులకు ఇది సంకేతంగా నిలుస్తుందని జెరూసలేం వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాక, గోల్డెన్‌ పేజర్‌తో పాటు ఒక సాధారణ పేజర్‌ను కూడా కానుకగా ఇచ్చారు. దీన్ని స్వీకరించిన ట్రంప్‌ తన కృతజ్ఞతను తెలిపి, గత ఆపరేషన్‌ అత్యంత విజయవంతమైనదిగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

వివరాలు 

పేలిన వందల సంఖ్యలో పేజర్లు

గత సంవత్సరం సెప్టెంబర్‌ 17న లెబనాన్‌, సిరియా ప్రాంతాల్లో వందల సంఖ్యలో పేజర్లు పేలిపోయాయి. ఈ దాడుల్లో 40 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 3,000 మంది గాయాలపాలయ్యారు. ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్‌ ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై లెబనాన్‌ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. దాదాపు రెండు నెలల తర్వాత, హెజ్‌బొల్లాను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించామని ఇజ్రాయెల్‌ అధికారికంగా అంగీకరించింది.