LOADING...
israel: ఇజ్రాయెల్‌ కొత్త 'లైట్‌ బీమ్‌' డిఫెన్స్‌ సిస్టమ్‌.. అమెరికాలో ప్రదర్శన 
ఇజ్రాయెల్‌ కొత్త 'లైట్‌ బీమ్‌' డిఫెన్స్‌ సిస్టమ్‌.. అమెరికాలో ప్రదర్శన

israel: ఇజ్రాయెల్‌ కొత్త 'లైట్‌ బీమ్‌' డిఫెన్స్‌ సిస్టమ్‌.. అమెరికాలో ప్రదర్శన 

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 09, 2024
12:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌కు చెందిన రఫేల్‌ అడ్వాన్స్‌డ్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ వచ్చే రోజుల్లో అమెరికాలో తన సరికొత్త ఆయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించనున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన లైట్‌ బీమ్‌ లేజర్‌ ఇంటర్‌సెప్షన్‌ సిస్టమ్‌ వాషింగ్టన్‌ డీసీలో ప్రదర్శించనున్నారు. ఇప్పటికే యాంటీ ట్యాంక్‌ వ్యవస్థగా ఉన్న ట్రోఫీ వ్యవస్థలో దీనిని జత చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి యాంటీ డ్రోన్‌ సామర్థ్యం కూడా ఉంది. షార్ట్‌ డిఫెన్స్‌ క్షేత్రంలో ఇది ఒక కొత్త మైలురాయిగా అవతరించే అవకాశం ఉంది. ఈ సిస్టమ్‌ సామర్థ్యాలను ఇజ్రాయెల్‌ దళాలు ఇప్పటికే పరీక్షలను నిర్వహించింది. ఇది ప్రత్యేకంగా డ్రోన్లపై సమర్థంగా పనిచేయగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Details

తక్కువ ఖర్చుతో అన్‌లిమిటెడ్‌ మ్యాగ్జైన్‌ వంటి ఫీచర్లు

కొన్ని సందర్భాల్లో మోర్టార్‌ దాడులను ఎదుర్కొనేందుకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. భవిష్యత్తులో ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు మొత్తం లేజర్‌ ఆధారితంగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ సిస్టమ్‌లను ప్రయోగించేందుకు చాలా తక్కువ ఖర్చు అవసరం కావడంతో, ప్రస్తుతం ఉన్న ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థల్లో వాడే క్షిపణుల వినియోగం తగ్గే అవకాశం ఉంది. లైట్‌ బీమ్‌ సిస్టమ్‌ కాంతి వేగంతో శత్రు ఆయుధాలపై దాడి చేయగలదు. ఇది అతి తక్కువ ఖర్చుతో అన్‌లిమిటెడ్‌ మ్యాగ్జైన్‌ వంటి ఫీచర్లను అందిస్తుంది. దీన్ని వ్యాన్‌లు, ట్రక్కులు, బ్యాటిల్‌ ట్యాంక్‌లపై అమర్చి ఉపయోగించవచ్చు. ప్రస్తుతం 20 కి పైగా దేశాలు ఇజ్రాయెల్‌ ట్రోఫీ యాంటీ ట్యాంక్‌ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు.