Page Loader
Hezbollah: 70 శాతం హెజ్‌బొల్లా డ్రోన్లను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్‌
70 శాతం హెజ్‌బొల్లా డ్రోన్లను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్‌

Hezbollah: 70 శాతం హెజ్‌బొల్లా డ్రోన్లను నేలమట్టం చేసిన ఇజ్రాయెల్‌

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 01, 2024
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్‌ తమకు ముప్పుగా మారిన లెబనాన్‌లోని హెజ్‌బొల్లా డ్రోన్ యూనిట్‌ 127 పై తీవ్ర దాడులు చేసి దాదాపు 70 శాతం డ్రోన్లను ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. సెప్టెంబర్ మధ్య నుండి ఈ దాడులను ప్రారంభించిన ఇజ్రాయెల్, యూనిట్ కమాండర్‌తో పాటు 10 శాతం ఆపరేటర్లను అణచివేసినట్లు స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్‌లో ఉత్తర లిటానీ ప్రాంతంలో 54 స్థానాలను, 24 ఆపరేషన్ ప్రదేశాలను, 8 అసెంబ్లింగ్ కేంద్రాలను, 6 అండర్‌ గ్రౌండ్‌ బేస్‌లను, 7 డ్రోన్ గోదాములను పేల్చేసినట్లు ఐడీఎఫ్‌ ధ్రువీకరించింది. హెజ్‌బొల్లా డ్రోన్ల ప్రభావం ఇజ్రాయెల్‌ ఎయిర్‌ డిఫెన్స్ వ్యవస్థలను సవాల్ చేస్తోంది. డ్రోన్లను కూల్చడం ఇజ్రాయెల్‌కు కష్టమవుతోంది.

Details

20శాతం శక్తితోనే పోరాడుతున్న హెజ్ బొల్లా

ఇప్పటివరకు ప్రయోగించిన 1,300 డ్రోన్లలో కేవలం 231 డ్రోన్లను మాత్రమే ధ్వంసం చేయగలిగింది. రాకెట్లను 90 శాతం వరకు అడ్డుకున్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, డ్రోన్ల విషయంలో 80 శాతం మాత్రమే ప్రతిస్పందించగలిగాయి. రాకెట్ శక్తిగా పేరున్న హెజ్‌బొల్లా, ఇజ్రాయెల్‌తో జరిగిన పోరులో భారీ నష్టాన్ని చవిచూసింది. యుద్ధానికి ముందు దాని వద్ద 1.5 లక్షల ప్రొజెక్టైల్స్ ఉన్నప్పటికీ, ఇజ్రాయెల్ దాదాపు 80 శాతం రాకెట్లు ధ్వంసం చేసింది. గల్లంట్ ప్రకారం, హెజ్‌బొల్లా ప్రస్తుతం తమ మిగిలిన 20 శాతం శక్తితోనే పోరాడుతోంది. మరోవైపు, హెజ్‌బొల్లాకు మద్దతుగా ఉన్న ఇరాన్‌లోని క్షిపణి ఇంధన మిక్సర్లను కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేసి, క్షిపణుల తయారీ సామర్థ్యాన్ని సవాల్ చేసింది.