
Israel-Hamas: మళ్లీ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. 66 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఉద్రిక్తత తీవ్రంగా కొనసాగుతోంది.
శనివారం అర్థరాత్రి టెల్ అవీవ్ నుంచి గాజాపై వైమానిక దాడులు నిర్వహించగా, ఖాన్ యూనిస్‌లో 20, ఉత్తర గాజాలో 36, జబాలియాలోని శరణార్థి శిబిరంలో 10 మంది మృతి చెందారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మొత్తం 66 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇందులో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది, ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అనేక మంది గాయాలపాలై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Details
3వేలకు పైగా పాలస్తీనీయన్లు మృతి
శనివారం రోజే గాజాలో 150 మంది మృతి చెందగా, 450 మందికి గాయాలయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది.
మార్చి 18న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన అయినప్పటి నుంచి 3,000కు పైగా పాలస్తీనియన్లు మృతిచెందినట్లు కూడా తెలిపింది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల ప్రకటించిన ప్రకారం, హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించడంతోనే ఈ దాడులు జరుగుతున్నట్లు తెలిపారు.
హమాస్ బందీలను విడుదల చేయడంలో నిరాకరిస్తున్నదని, అమెరికా ప్రత్యేక రాయబారి ప్రతిపాదించిన ఒప్పందాన్ని కూడా తిరస్కరించిన కారణంగా గాజాలోని హమాస్ స్థావరాలపై ఐడీఎఫ్ దాడులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. ఆయన ఈ విషయాన్ని ఎక్స్ (Twitter)లో పోస్టు చేశారు