NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / అంతర్జాతీయం వార్తలు / Israel: ఇజ్రాయెల్‌ డ్రోన్ల నుండి శిశువుల ఏడుపు శబ్దాలు.. ఎందుకోసమంటే..?
    తదుపరి వార్తా కథనం
    Israel: ఇజ్రాయెల్‌ డ్రోన్ల నుండి శిశువుల ఏడుపు శబ్దాలు.. ఎందుకోసమంటే..?
    ఇజ్రాయెల్‌ డ్రోన్ల నుండి శిశువుల ఏడుపు శబ్దాలు.. ఎందుకోసమంటే..?

    Israel: ఇజ్రాయెల్‌ డ్రోన్ల నుండి శిశువుల ఏడుపు శబ్దాలు.. ఎందుకోసమంటే..?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 05, 2024
    08:49 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇజ్రాయెల్‌ దాడుల వల్ల గాజా ప్రాంతంలో పరిస్థితులు మరింత అస్తవ్యస్తమవుతున్నాయి.

    వేలాది భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి, దీంతో పౌరులు నివాసానికి గాలింపు లేకుండా శిబిరాలలో తలదాచుకుంటున్నారు.

    గాజాలో పౌరుల దుస్థితి పై ఐక్యరాజ్య సమితి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

    ఈ పరిణామాల నేపథ్యంలో, గాజా మీద ఇజ్రాయెల్‌ ప్రయోగిస్తున్న డ్రోన్ల ద్వారా చిన్న పిల్లల ఏడుపు శబ్దాలు వినిపిస్తున్నాయని తాజా సమాచారాలు వెల్లడయ్యాయి.

    ఈ చర్యలు పాలస్తీనీయులను బయటకు రప్పించి దాడులు చేయడం కోసం ఉపయోగిస్తున్నట్లు యూరో-మిడ్‌ హ్యూమన్‌ రైట్స్‌ మానిటర్‌ మాహా హుస్సేని ఆరోపించారు.

    వివరాలు 

    ఖాన్‌ యూనిస్‌లో కూడా ఇలాంటి ఘటనలు 

    ''ఏప్రిల్‌ మధ్యలో మాకు ఈ విషయమై సమాచారం వచ్చింది. ఇజ్రాయెల్‌ క్వాడ్‌కాప్టర్ల డ్రోన్ల నుండి చిన్న పిల్లల ఏడుపు, మహిళల ఆర్తనాదాలు వంటి శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి నేను నుసెరాయిత్‌లో పర్యటించి పలువురు పాలస్తీనీయులతో మాట్లాడి సాక్ష్యాధారాలు సేకరించాను'' అని మాహా హుస్సేని ఓ అంతర్జాతీయ మీడియాకు చెప్పారు.

    ఆమె వివరణ ప్రకారం, ఈ శబ్దాలు వినిపించడం ద్వారా ఇజ్రాయెల్‌ పాలస్తీనీయులను శిబిరాల నుంచి బయటకు రప్పించి వారిపై దాడులు చేయడమే లక్ష్యమని ఆమె అన్నారు.

    చిన్న పిల్లల ఏడుపు, మహిళల అరుపులు విని సహాయం కోసం వెళ్ళిన చాలామంది దాడుల్లో గాయపడ్డారని ఆమె వెల్లడించారు.

    ఖాన్‌ యూనిస్‌లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఆమె వివరించారు.

    వివరాలు 

    డ్రోన్లలో సౌండ్‌ వ్యవస్థ

    గతేడాది అక్టోబరు 7 నుండి గాజాపై ప్రారంభమైన ఇజ్రాయెల్‌ దాడులలో, ఈ రిమోట్‌ కంట్రోల్‌ ఆధారిత క్వాడ్‌కాప్టర్లు విరివిగా ఉపయోగించబడ్డాయి.

    నిఘా పెట్టడం, మూకలను చెదరగొట్టడం వంటివి ఈ డ్రోన్ల ద్వారా చేయబడుతున్నాయి.

    ఈ ఏడాది జనవరిలో గాజాలో ఆహారం కోసం రాక్షసంగా పోరాడిన వందలాది పౌరులపై కూడా ఈ డ్రోన్లతో కాల్పులు జరిపినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

    తాజాగా, ఈ డ్రోన్లలో సౌండ్‌ వ్యవస్థను అమర్చినట్లు తెలుస్తోంది, దీనిలో హిబ్రూ, అరబిక్‌ భాషల్లో శబ్దాలు వినిపిస్తున్నాయని సమాచారం.

    వివరాలు 

    పాలస్తీనియన్ల మానవ హక్కులను కాలరాయించి..

    ఇతర విషయాల్లో, గాజాలో ఇజ్రాయెల్‌ మారణహోమంపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

    ''ఇజ్రాయెల్‌ పాలస్తీనియన్ల మానవ హక్కులను కాలరాయించి, వారిని నాశనం చేయడమే లక్ష్యంగా చూస్తోంది.

    గాజాలో జరిగిన విధ్వంసంపై శాటిలైట్‌ చిత్రాలు,క్షేత్రస్థాయి నివేదికలు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

    ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం మేల్కొనాలి'' అని ఆమ్నెస్టీ చీఫ్‌ ఆగ్నెస్‌ క్యాలమా తన నివేదికలో తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇజ్రాయెల్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఇజ్రాయెల్

    Iran: ఇరాన్ ప్రభుత్వ టీవీలో కనిపించిన ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఇస్మాయిల్ ఖానీ ఇరాన్
    Israel: ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్ ఏరియల్ యూనిట్ అధిపతి మృతి హమాస్
    US-Israel:30 రోజుల్లో మానవతా సాయం పెంచండి లేదంటే.. ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన అమెరికా  అమెరికా
    Israel-Hamas: ఖనా నగరంలో ఇజ్రాయెల్ దాడి.. 15 మంది దుర్మరణం లెబనాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025