Donald Trump: ట్రంప్‌ను కలిసిన ఇటలీ ప్రధాని, ఉక్రెయిన్ యుద్ధం సహా కీలక అంశాలపై చర్చ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టడానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ట్రంప్‌ను కలిసి చర్చలు జరిపారు. శనివారం ఫ్లోరిడాలోని ట్రంప్ మార్-ఎ-లాగో ఎస్టేట్‌లో ఈ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ఇది చాలా సంతోషకరమైన సమయమని, అద్భుతమైన మహిళ, ఇటలీ ప్రధానితో ఉన్నానని అన్నారు.
ఈ భేటీకి సంబంధించిన వివరాలపై ఇంకా స్పష్టత రాలేదు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం, వాణిజ్య సమస్యలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఇక ఇరాన్‌లో నిర్బంధంలో ఉన్న ఇటాలియన్ జర్నలిస్టు విడుదల వంటి కీలక అంశాలపై చర్చించినట్లు ఇటాలియన్ వార్తా సంస్థలు వెల్లడించాయి.
Details
ఎలాంటి ప్రకటన విడుదల చేయని ప్రధాని కార్యాలయం
అయితే ఇటలీ ప్రధాని కార్యాలయం ఈ సమావేశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఇరాన్ అధికారులు ఇటలీకి చెందిన ఓ జర్నలిస్టును అరెస్ట్ చేసిన విషయాన్ని ఇటలీ విదేశాంగశాఖ ధ్రువీకరించింది. టెహ్రాన్‌లోని ఈ అరెస్ట్ అంశం సమావేశంలో ప్రాధాన్యత పొందినట్లుగా తెలుస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం అనంతరం, ప్రపంచంలోని అనేక దేశాధినేతలు ట్రంప్‌తో భేటీ అవుతున్నారు.
అంతకుముందు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలి, హంగేరీ ప్రధాని విక్టోర్ అర్బన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ట్రంప్‌ను కలిసిన వారిలో ఉన్నారు.