Loading...
Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు గుండె చికిత్స అత్యవసరం.. వ్యక్తిగత వైద్యుడి హెచ్చరిక
ఇమ్రాన్ ఖాన్‌కు గుండె చికిత్స అత్యవసరం.. వ్యక్తిగత వైద్యుడి హెచ్చరిక

Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు గుండె చికిత్స అత్యవసరం.. వ్యక్తిగత వైద్యుడి హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 23, 2026
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన వ్యక్తిగత వైద్యుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గుండెకు శాశ్వత నష్టం కలగకుండా ఉండాలంటే వెంటనే వైద్య చికిత్స అందించాలని హెచ్చరించారు. 74 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ రక్తపోటు అదుపులోకి రావడం లేదని, మరికొద్ది రోజుల్లోనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఫైసల్ సుల్తాన్ సూచించారు. చికిత్సలో జాప్యం జరిగితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గత మూడు దశాబ్దాలుగా ఇమ్రాన్ ఖాన్‌కు డాక్టర్ ఫైసల్ సుల్తాన్ వైద్య సేవలు అందిస్తున్నారు.

వివరాలు 

కీలక అవయవాలకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం

ఇమ్రాన్ ఖాన్‌కు వెంటనే వైద్యం అందించాల్సిన అవసరం ఉందని డాక్టర్ ఫైసల్ సుల్తాన్ స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని ది టెలిగ్రాఫ్ పత్రికకు వెల్లడిస్తూ.. ఇలాంటి స్థాయిలో రక్తపోటు ఎక్కువగా ఉన్న రోగిని వీలైనంత త్వరగా మంచి నెఫ్రాలజిస్ట్ (మూత్రపిండాల నిపుణుడు) లేదా కార్డియాలజిస్ట్ (గుండె వైద్య నిపుణుడు) వద్దకు తీసుకెళ్లాలని తెలిపారు.

రక్తపోటు ఎక్కువకాలం అదుపులో లేకపోతే మూత్రపిండాలు, గుండె, కంటిలోని రెటీనాతో పాటు కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

వివరాలు 

ఏకాంత నిర్బంధంలో ఇమ్రాన్ ఖాన్

జైలులో ఇమ్రాన్ ఖాన్‌ను ఒంటరిగా ఉంచడం కూడా ఆయన ఆరోగ్య సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోందని డాక్టర్ సుల్తాన్ అభిప్రాయపడ్డారు.

తన చిరకాల రోగిని స్వయంగా పరీక్షించేందుకు అధికారులు అనుమతి ఇవ్వాలని కోరారు.

మరోవైపు, వైద్య చికిత్స కోసం తనను మరోచోటికి తరలించాలని, కుటుంబ సభ్యులతో సమావేశానికి అనుమతించాలని కోర్టులు ఇచ్చిన ఆదేశాలను అధికారులు అమలు చేయడం లేదని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.

ఈ మేరకు పాకిస్థాన్ సుప్రీంకోర్టుకు బహిరంగ లేఖ రాశారు. 2025 డిసెంబర్ 20 నుంచి తనను సుదీర్ఘకాలంగా ఏకాంత నిర్బంధంలో ఉంచారని అందులో పేర్కొన్నారు.

రోజుకు 22 గంటల వరకు ఒంటరిగా గడపాల్సి వస్తోందని, కుటుంబ సభ్యులను, న్యాయవాదులను కలిసే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.

ADVERTISEMENT

వివరాలు 

2023 నుంచి జైలులోనే మాజీ ప్రధాని

అవినీతి కేసులో దోషిగా తేలడంతో ఇమ్రాన్ ఖాన్ 2023 నుంచి జైలులో ఉన్నారు.

అంతకుముందు 2022 ఏప్రిల్‌లో పార్లమెంటులో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఆయన ప్రధాని పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది.

అనేక న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ పాకిస్థాన్ రాజకీయాల్లో ఆయన ఇప్పటికీ కీలక నేతగా కొనసాగుతున్నారు.

ఆయనకు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం ప్రచారం చేస్తోంది.

ADVERTISEMENT