
Operation Sindoor: జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ సోదరుడు.. IC-814 హైజాక్ మాస్టర్‌మైండ్ రవూప్ అజహర్ హతం..!
ఈ వార్తాకథనం ఏంటి
ఆపరేషన్ సిందూర్‌లో భారత దళాలు ఓ కీలక విజయాన్ని సాధించడమే కాక, 1999లో జరిగిన ఐసీ-814 విమాన హైజాక్‌కు సంబంధించి చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రతీకారాన్ని కూడా తీర్చుకున్నాయి.
ఆ హైజాక్ సంఘటనకు మాస్టర్‌మైండ్‌గా భావించబడుతున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అబ్దుల్ రవూఫ్ అజహర్ ఈ దాడిలో హతమయ్యాడు.
భారత వాయుసేన బలగాలు పాకిస్థాన్‌లోని బహావల్‌పుర్ ప్రాంతంలో ఉన్న మర్కజ్ సుబాన్ కాంప్లెక్స్‌పై టార్గెట్ చేసిన ఈ దాడిలో జైషే చీఫ్ మసూద్ అజర్‌కు సన్నిహితులుగా ఉన్న 14 మంది మృతి చెందారు.
అందులో రవూఫ్ అజహర్‌తో పాటు మసూద్ అజహర్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య వంటి కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్లు సమాచారం.
వివరాలు
రవూఫ్ అజహర్ - పలువురు ఉగ్రదాడుల్లో కీలక నిందితుడు
రవూఫ్ అజహర్ పలు అంతర్జాతీయ స్థాయి ఉగ్రదాడుల్లో తన పాత్రను పోషించాడు.
ముఖ్యంగా, అమెరికన్ జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ హత్యకేసులో అతని పాత్ర ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి.
2002లో ఉగ్రవాదంపై పరిశోధన చేస్తూ పాకిస్తాన్‌లోని కరాచీకి వచ్చిన డేనియల్ పెర్ల్‌ను మతపెద్దల్ని కలవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో కాందహార్ హైజాక్ సందర్భంగా విడుదలైన ఉగ్రవాది ఒమర్ షేక్ హోటల్ నుండి కిడ్నాప్ చేసి హత్య చేశాడు.
ఈ కుట్రలో రవూఫ్ భాగస్వామిగా ఉన్నట్లు వెల్లడైంది.
వివరాలు
ఐసీ-814 హైజాక్ నుంచి పుల్వామా దాకా - రవూఫ్ చీకటి చరిత్ర
1999లో ఐసీ-814 హైజాక్ ఘటనలో రవూఫ్ అజహర్ కీలక పాత్ర పోషించాడు.
ఆ ఘటనలో ఐదుగురు పాకిస్తానీ ఉగ్రవాదులు నేపాల్ నుంచి బయలుదేరిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌కు తీసుకెళ్లారు.
అనంతరం భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి, భారత జైళ్లలో ఖైదీలుగా ఉన్న మసూద్ అజర్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గర్‌లను విడుదల చేయించారు.
ఆ తర్వాత మసూద్ అజర్ 'జైషే మహ్మద్' అనే ఉగ్ర సంస్థను స్థాపించాడు.
వివరాలు
2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరం మీద దాడి
అతనికితడు రవూఫ్ అజహర్ 2001లో భారత పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడి, 2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరం మీద జరిగిన దాడి, 2019లో జవాన్లను లక్ష్యంగా చేసిన పుల్వామా బాంబు దాడిలాంటి అతి ప్రమాదకర ఘటనలన్నిటిలోనూ కీలక పాత్ర పోషించాడు.
ప్రస్తుతానికి జైషే మహ్మద్‌లో కీలక కమాండర్‌గా కొనసాగుతున్న ఇతడు, భారత్ చేపట్టిన ఈ తాజా దాడిలో హతమవడం వ్యూహాత్మకంగా పెద్ద విజయంగా భావించబడుతోంది.