Page Loader
Jaishankar: బ్రెజిల్‌ వేదికగా భారత్‌-చైనా విదేశాంగ మంత్రులు భేటీ 
బ్రెజిల్‌ వేదికగా భారత్‌-చైనా విదేశాంగ మంత్రులు భేటీ

Jaishankar: బ్రెజిల్‌ వేదికగా భారత్‌-చైనా విదేశాంగ మంత్రులు భేటీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 19, 2024
10:54 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా, భారత విదేశాంగ మంత్రులు రియో డి జనిరోలో భేటీ అయ్యారు. జీ20 సదస్సులో భాగంగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశమయ్యారు. ఈ భేటీలో, భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణ విషయంలో కొంత పురోగతి సాధించినట్టు పేర్కొన్నారు. ఈ పురోగతిని స్వాగతించదగ్గ పరిణామంగా అభివర్ణిస్తూ, ఇది మరిన్ని అవకాశాలకు మార్గం సుగమం చేస్తుందని జైశంకర్‌ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల తదుపరి కార్యాచరణపై చర్చలు నిర్వహించామని, అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్-చైనా ప్రాముఖ్యతను ఈ సమావేశం గుర్తుచేసిందని జైశంకర్‌ వివరించారు.

వివరాలు 

కీలక గస్తీ ఒప్పందం

జైశంకర్‌ సోషల్‌ మీడియా వేదికగా మాట్లాడుతూ, ''జీ20 సమ్మిట్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సమావేశం జరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ విషయంలో పురోగతి సాధించాం. అంతేకాకుండా, ప్రపంచ రాజకీయ పరిణామాలపై చర్చించాం'' అని తెలిపారు. గతంలో 2020 జూన్‌ 15న తూర్పు లద్దాఖ్‌ గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణ ఇరుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘటనలో కర్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందగా,చైనా కూడా సైనికులను కోల్పోయింది. అయితే, చైనా తమ నష్టాన్ని వెల్లడించలేదు.ఈ ఉద్రిక్తతలను సమర్థవంతంగా నివారించేందుకు ఇరుదేశాలు పలు చర్యలు చేపట్టాయి. నాలుగేళ్లుగా కొనసాగుతున్న సమస్యలకు ముగింపు పలికేందుకు ఇటీవల కీలక గస్తీ ఒప్పందం కుదిరినట్టు సమాచారం.