Japan Airlines: జపాన్ ఎయిర్‌లైన్స్ పై సైబర్ ఎటాక్ .. విమాన సేవలపై ప్రభావం
జపాన్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్ దాడి జరిగింది, దీని ప్రభావం భారీగా దేశీయ, అంతర్జాతీయ విమానాలపై పడింది. టిక్కెట్ల విక్రయాలు నిలిచిపోవడంతో పాటు, బ్యాగేజీ చెక్-ఇన్ సిస్టమ్‌లో కూడా సమస్యలు తలెత్తాయి. ఈ ఘటన గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో జరిగింది. సైబర్ దాడిని ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి ధృవీకరించారు. ప్రస్తుతం సమస్యను పరిష్కరించేందుకు విమానయాన సంస్థ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. అయితే, విమానాల ఆలస్యం లేదా రద్దుకు సంబంధించి ఎలాంటి తాజా సమాచారం అందుబాటులో లేదని అధికారులు తెలిపారు. జపాన్ ఎయిర్‌లైన్స్ (JAL) దేశంలో ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్ (ANA) తర్వాత రెండవ అతిపెద్ద విమానయాన సంస్థగా కొనసాగుతోంది.