Qantas flight: ప్రయాణికుల ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిర్వాకం.. నెట్టింట తీవ్ర విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బోర్‌గా ఫీల్ కాకుండా ఉండటానికి బస్సులు, విమానాల్లో సాధారణంగా సినిమాలు, పాటలు ప్లే చేయడం జరుగుతుంది.
ప్రత్యేకంగా, విమానాల్లో ప్రతి ప్రయాణికుడికి ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఉంటాయి, అవసరం లేకపోతే ఆఫ్ చేసుకునే వీలుంది.
కానీ, ఆస్ట్రేలియా నుంచి జపాన్‌కు బయలుదేరిన క్వాంటాస్ ఎయిర్లైన్స్ విమానంలో ప్రయాణికులు ఒక చేదు అనుభవానికి లోనయ్యారు.
క్వాంటాస్ ఫ్లైట్ QF59 సిడ్నీ నుంచి జపాన్‌లోని హనెడాకు బయలుదేరింది.ప్రయాణికుల్లో మహిళలు, చిన్నారులు చాలా మందే ఉన్నారు.
ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఓ సినిమా ప్రదర్శించడం ప్రారంభించగా, అది 'అడల్ట్ కంటెంట్'గా ఉండటం వల్ల ప్రయాణికుల్లో కొందరికి అసౌకర్యం జరిగింది.
వారు ఈ బ్రాడ్‌కాస్ట్‌ను ఆపించాలని ప్రయత్నించినా సాంకేతిక సమస్యల కారణంగా ఆ అవకాశం కుదరలేదు.
వివరాలు
క్షమించాలంటూ క్వాంటాస్ ప్రకటన
ఈ అంశంపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన ప్రయాణికులు, సిబ్బంది ప్రయత్నించినా స్క్రీన్లలో చిత్రం ఆగడానికి అనుమతి ఇవ్వలేదు.
చివరికి, ఆ చిత్రాన్ని నిలిపి పిల్లలకు అనుకూలమైన మరో సినిమా ప్రదర్శించడానికి నిర్ణయం తీసుకున్నారు.
ఈ అసౌకర్యాని క్షమించాలంటూ క్వాంటాస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
''విమానంలో ప్రదర్శించిన చిత్రం 'అందరికీ' సంబంధించిన కాదని అర్థమైంది. ఇలాంటి చేదు అనుభవం ఎదుర్కొన్న ప్రతి ప్రయాణికుడికి మేం క్షమాపణలు చెబుతున్నాం. వెంటనే సినిమాను మార్చేసి వేరొక దాన్ని ప్రదర్శించాం. మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. ఇదంతా సాంకేతిక సమస్య వల్లే ఎదురైంది'' అని ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి తెలిపారు.
వివరాలు
సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రయాణికులు
అయితే, అప్పటికే కొన్ని ప్రయాణికులు ఈ సంఘటనను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
''చిన్నారులు,మహిళలతో ప్రయాణం చేస్తున్న వారికీ ఇది తీవ్రమైన ఇబ్బందిగా ఉంది.ఇలాంటి సినిమాను ప్రదర్శించినప్పుడు కనీసం ఆఫ్ చేసే అవకాశం లేకుండా ఉండటం దారుణం'' అని ప్రయాణికులు కామెంట్లు చేశారు.