
Helicopter Crash: జపాన్ తీరంలో కుప్పకూలిన మెడికల్ హెలికాప్టర్.. రోగితో సహా ముగ్గురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌లో ఒక మెడికల్ ట్రాన్స్‌పోర్ట్ హెలికాప్టర్ కూలిపోయిన ఘటన చోటుచేసుకుంది.
ఈ సంఘటన ఆ దేశ నైరుతి ప్రాంతంలో జరిగింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఒక రోగితో పాటు మరొద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
పైలట్ హిరోషి హమదా, హెలికాప్టర్ మెకానిక్ కజుటో, 28 ఏళ్ల నర్స్ సకురా ప్రాణాలతో బయటపడగలిగారు.
వీరిని జపాన్ కోస్ట్ గార్డ్ అధికారులు విజయవంతంగా రక్షించారు. ఈ ముగ్గురికీ హైపోథర్మియా (తక్కువ శరీర ఉష్ణోగ్రత) లక్షణాలు కనిపించాయి, కానీ వారు స్పృహలో ఉన్నారని వైద్యులు తెలిపారు.
వివరాలు
రెస్క్యూ ఆపరేషన్ కోసం రెండు విమానాలు, మూడు నౌకలు
ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో మెడికల్ డాక్టర్ కీవ్ అరకావా, రోగి మిత్సుకీ మోటోషి, అలాగే ఆ రోగికి సహాయం చేస్తున్న కేర్‌టేకర్ కజుయోషి మోటిషి ఉన్నారు.
వారి మృతదేహాలను జపాన్ ఎయిర్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్ ద్వారా సేకరించారు.
ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం రెండు విమానాలు, మూడు నౌకలను కోస్ట్ గార్డ్ మోహరించారు.
ప్రమాద సమయంలో హెలికాప్టర్ నాగాసాకి జిల్లా నుండి ఫుకునోవాలోని ఓ హాస్పిటల్‌కు వెళ్తుండగా ఈ విషాదకర ఘటన జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.