తదుపరి వార్తా కథనం

Japan Earthquake: జపాన్‌లో 7.1 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
వ్రాసిన వారు
Sirish Praharaju
Aug 08, 2024
02:11 pm
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్‌లో బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. భూకంపంతో పాటు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు.
జపాన్‌లోని క్యుషు, షికోకు దీవుల్లో ఈ భూకంపం సంభవించింది. భూకంపంతో పాటు, మియాజాకి, కొచ్చి, ఇహైమ్, కగోషిమా, ఐటాతో సహా జపాన్‌లోని అనేక తీర ప్రాంతాలలో సునామీ హెచ్చరిక జారీ చేశారు. అధికార యంత్రాంగం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారు.
మియాజాకి, క్యుషులో 20 సెంటీమీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి.
ఇంతకు ముందు కూడా జపాన్‌లో భూకంపం సంభవించిందని, దానిలో చాలా మంది ప్రాణాలు కోల్పోగా , భారీగా ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జపాన్‌లో భూకంపం
A powerful earthquake measuring magnitude 6.9 hits off southern Japan; tsunami advisory issued https://t.co/NX5rVt3GiU pic.twitter.com/m9AqH4QvYm
— Global Voters (@global_voters) August 8, 2024