
JD Vance: సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. అవసరమైతే అధ్యక్ష పదవి స్వీకరిస్తా..
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనాన్ని సృష్టించాయి. దేశంలో అనుకోని, భయంకరమైన పరిస్థితులు ఏర్పడితే, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. ఇది ప్రధానంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై వచ్చే ఊహాగానాల మధ్య జరిగిన ప్రకటనగా విశేష ప్రాధాన్యత పొందుతోంది.
వివరాలు
ట్రంప్ ఆరోగ్యంపై వాన్స్ అభిప్రాయం
జేడీ వాన్స్ మాట్లాడుతూ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపిస్తున్నారని తెలిపారు. ట్రంప్‌తో కలిసి పనిచేసే వారిలో చాలామంది ఆయన కంటే యువతరం అని, అయినప్పటికీ వారందరి కంటే చివరి వరకు నిద్ర పోనివాడు, ఉదయం ముందుగా లేచేది అధ్యక్షుడే అని వివరించారు. కొన్నిసార్లు దేశంలో భయంకరమైన పరిస్థితులు చోటుచేసుకున్నా, ట్రంప్ వాటన్నింటినీ అధిగమించి, తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారని వాన్స్ విశ్వసించారు. అధ్యక్ష బాధ్యతపై వాన్స్ స్పష్టం అమెరికన్ల కోసం ట్రంప్ మంచి చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని వాన్స్ గుర్తు చేశారు. అయితే, ఏదైనా అనుకోని పరిస్థితి సంభవించినట్లయితే, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఉపాధ్యక్షుడు స్పష్టం చేశారు.
వివరాలు
డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి
ప్రస్తుతం, డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఎక్కువ చర్చ జరుగుతోంది. ఆయనకు దీర్ఘకాల సిరల వ్యాధి ఉన్నట్లు తేలింది. కానీ, ఇది సాధారణ రక్తప్రసరణ వ్యాధి, 70 ఏళ్ళ వయసు దాటిన వారిలో తరచుగా కన్పిస్తుందని వైట్ హౌస్ వెల్లడించింది. 2028 అధ్యక్ష ఎన్నికల దిశ ఈ నేపథ్యంలో, అమెరికాను మరింత గొప్పగా మార్చేందుకు జేడీ వాన్స్ "మేక్ అమెరికా గ్రేట్ అగెయిన్" ఉద్యమంలో వారసుడు అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని ట్రంప్ తెలియజేశారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఈ కాంపెటీషన్‌లో పాల్గొనవచ్చని జేడీ వాన్స్ గుర్తించారు. 2028 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున వాన్స్ అభ్యర్థిగా నిలవే అవకాశం ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.