LOADING...
USA: జెట్‌బ్లూ విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. డోర్‌ తెరిచేందుకు యువకుడి యత్నం
జెట్‌బ్లూ విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. డోర్‌ తెరిచేందుకు యువకుడి యత్నం

USA: జెట్‌బ్లూ విమానంలో గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. డోర్‌ తెరిచేందుకు యువకుడి యత్నం

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 09, 2025
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలి కాలంలో విమానాల్లో కొంతమంది ప్రయాణికులు వివాదాస్పదంగా ప్రవర్తించడం, సిబ్బందిపై దాడి చేయడం వంటి ఘటనలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా జెట్‌ బ్లూ విమానంలో ఒక ప్రయాణికుడు తోటివారిని భయాందోళనలకు గురి చేశాడు. గాల్లో ఉన్న సమయంలో అత్యవసర ద్వారాన్ని తెరవడానికి అతను ప్రయత్నించాడు. ఈ ఘటన అమెరికాలోని లారెన్స్‌ లోగాన్ విమానాశ్రయంలో జరిగింది. అధికారుల ప్రకారం, ప్యూర్టోరికోకు చెందిన మోరెల్స్‌ టెర్రోస్ అనే వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఆ విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో టెర్రోస్‌ అత్యవసర ద్వారాన్ని తెరిచి దూకేందుకు ప్రయత్నించాడు. దీనితో, ఇతర ప్రయాణికులు భయపడిపోయారు. వెంటనే, విమాన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు.

వివరాలు 

 విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ 

తర్వాత, విమానాన్ని సమీపంలోని విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. మసాచుసెట్స్‌ పోలీసులు, విమాన సిబ్బంది ఫిర్యాదు మేరకు టెర్రోస్‌ను అదుపులోకి తీసుకున్నారు. తరువాత, అతడికి బెయిల్‌ మంజూరయ్యింది, కానీ కోర్టు అతడికి, మసాచుసెట్స్‌ తప్ప మరే ప్రాంతాలకు ప్రయాణించకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్ అధికారులు విచారణను ప్రారంభించారు.