LOADING...
Donald Trump: ట్రంప్‌ పేరిట అమెరికాలో 250 డాలర్ల నోట్ల ముద్రణకు యత్నాలు
ట్రంప్‌ పేరిట అమెరికాలో 250 డాలర్ల నోట్ల ముద్రణకు యత్నాలు

Donald Trump: ట్రంప్‌ పేరిట అమెరికాలో 250 డాలర్ల నోట్ల ముద్రణకు యత్నాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2025
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) జోరు కొనసాగుతూనే ఉంది. ఈసారి, ట్రంప్ చిత్రంతో 250 డాలర్ల నోటును ముద్రించాలని ప్రతిపాదన వెలువడింది. అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు జో విల్సన్‌ ఈ విషయాన్ని చట్టప్రతిపాదన రూపంలో ముందుకు తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడు. ఈమేరకు ఎక్స్ (Twitter) వేదికగా ఆయన ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలో ద్రవ్యోల్బణం తీవ్రమైందని, ప్రజలు ఎక్కువ నగదు లేకుండా అవసరాలు తీర్చుకోవడం కష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, ట్రంప్‌ను అత్యంత విలువైన అధ్యక్షుడిగా గుర్తించేందుకు 250 డాలర్ల నోటుపై ఆయన బొమ్మను ముద్రించాలనే నిర్ణయాన్ని బ్యూరో ఆఫ్ ఎన్‌గ్రేవింగ్ అండ్ ప్రింటింగ్‌కు సూచిస్తూ చట్టాన్ని ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.

వివరాలు 

ట్రంప్‌ను గౌరవించడానికి ఇది సరైన మార్గం: జో విల్సన్

ఈ ప్రతిపాదనపై సోషల్ మీడియాలో విభిన్న ప్రతిస్పందనలు వచ్చాయి. కొందరు దీనిని స్వాగతించగా, మరికొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ''250 డాలర్ల నోటు అవసరమా?'', ''ఇంకా చాలా ముఖ్యమైన సమస్యలున్నాయి, ఇదే ప్రాధాన్యమా?'' అంటూ పలువురు కామెంట్లు పెట్టారు. అయితే, ట్రంప్‌ను గౌరవించడానికి ఇది సరైన మార్గమని జో విల్సన్ సమర్థించారు. ఇంకా, ట్రంప్ తన బలమైన రాజకీయ పట్టును చాటుకుంటూనే ఉన్నారు. ఇటీవల ఆయన ప్రధానంగా ప్రచారం చేసిన కీలక బిల్లును అమెరికా చట్టసభ 2017-215 ఓట్ల తేడాతో ఆమోదించింది. ఈ బిల్లులో పన్నుల మార్పులు, కఠినమైన ఇమిగ్రేషన్ పాలసీ, కొత్త ఇంధన వనరుల కోసం డ్రిల్లింగ్ అనుమతులు, జాతీయ భద్రత కోసం భారీ ఖర్చులు వంటి కీలక అంశాలు ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జో విల్సన్‌ చేసిన ట్వీట్