Page Loader
Hush money case: హష్‌ మనీ కేసు.. డొనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్థనను తిరస్కరించిన న్యూయార్క్‌ కోర్టు 
హష్‌ మనీ కేసు.. డొనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్థనను తిరస్కరించిన న్యూయార్క్‌ కోర్టు

Hush money case: హష్‌ మనీ కేసు.. డొనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్థనను తిరస్కరించిన న్యూయార్క్‌ కోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 17, 2024
09:06 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. హష్ మనీ కేసు విషయంలో న్యూయార్క్ కోర్టులో ఆయనపై ఉన్న అభియోగాలను కొట్టివేయాలనే అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. మన్‌హట్టన్ న్యాయమూర్తి జువాన్ మర్చన్ ఈ కేసులో అధ్యక్షులకు రక్షణ ఉండదని స్పష్టం చేశారు. అధికారిక విధులకు సంబంధించిన అంశాల్లో మాత్రమే రక్షణ వర్తిస్తుందని, కానీ వ్యక్తిగత ప్రవర్తన విషయంలో ట్రంప్‌కు ఎలాంటి మినహాయింపు ఉండదని పేర్కొన్నారు.

వివరాలు 

ట్రంప్‌కు ఈ కేసులో రక్షణ లేదని తేల్చి చెప్పిన కోర్టు

ఈ కేసులో ట్రంప్‌ ఇప్పటికే నేరారోపణలతో దోషిగా తేలిపోయారు, కాగా నవంబరులో న్యూయార్క్ కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో, తనపై క్రిమినల్ విచారణ నిలిపివేయాలని ట్రంప్ కోర్టును ఆశ్రయించారు. గతంలో సుప్రీంకోర్టు అధ్యక్షులకు క్రిమినల్ విచారణ నుండి తాత్కాలిక రక్షణ కల్పించిన తీర్పును ప్రస్తావిస్తూ ట్రంప్ ఈ అభ్యర్థన చేశారు. అయితే, ఇటీవల కోర్టు దీనిపై విచారణ జరిపి, ట్రంప్‌కు ఈ కేసులో రక్షణ లేదని తేల్చి చెప్పింది. ఇది హష్ మనీ కేసు ఎలా మలుపు తీసుకుంటుందో అన్నది ఆసక్తికర అంశంగా మారింది.

వివరాలు 

హష్ మనీ కేసు వివరాలు 

2016లో అధ్యక్షఎన్నికల సందర్భంగా,ట్రంప్ తన న్యాయవాది ద్వారా శృంగారతార స్టార్మీ డానియల్స్‌కు 1.30లక్షల డాలర్ల హష్ మనీ ఇచ్చారని ఆరోపణలున్నాయి. ట్రంప్ ఆమెతో ఏకాంతంగా గడిపిన విషయంపై ఆమె నోరు విప్పకుండా ఈ డబ్బు చెల్లించారని,ఈ మొత్తాన్ని ఎన్నికల ప్రచార నిధుల నుంచి తీసుకున్నట్లు చెప్పబడింది. అందుకు సంబంధించిన రికార్డులను తారుమారు చేశారని కూడా ప్రధాన అభియోగం. మొత్తం 34నేరారోపణల కింద ట్రంప్‌పై కేసు నమోదైంది.ఆరువారాల విచారణ అనంతరం,12మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ట్రంప్‌పై మోపిన అభియోగాలన్నీ నిజమని ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించింది. స్టార్మీ డానియల్స్ స్వయంగా కోర్టులో తన వాంగ్మూలాన్ని ఇచ్చి ట్రంప్‌తో సంబంధం ఉన్న విషయాన్ని ధృవీకరించారు. మొత్తం 22మంది సాక్షులను విచారించిన కోర్టు ఈకేసులో కీలకమైన తీర్పును ఇచ్చింది.