కల్లోలంలో చిక్కుకున్న ట్రూడో.. రాజకీయం కోసమే భారతదేశంపై ఆరోపణలన్న కెనడా మాజీ ఎమ్మెల్యే
ఈ వార్తాకథనం ఏంటి
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ఆ దేశంలోని ఓ రాష్ట్ర అసెంబ్లీకి చెందిన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ మేరకు ప్రధాన మంత్రి రాజకీయ కల్లోలంతో సతమతమవుతున్నారని, అందుకే రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి హత్యా ఆరోపణలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యను రాజకీయ లబ్ధికి ఉపయోగించడాన్ని రిచ్‌మండ్ సిటీ కౌన్సిలర్, మాజీ ఎమ్మెల్యే, బ్రిటిష్ కొలంబియా సొలిసిటర్ జనరల్, మాజీ పోలీస్ చీఫ్ కాష్ హీద్ వ్యతిరేకించారు.
రాజకీయ బురద నుంచి తప్పించుకునేందుకు స్పష్టమైన ఆధారాలు లేకున్నా ప్రధాని ఇతర కారణాలను సాకుగా చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు.
కేవలం రాజకీయ కారణాలతోనే ఉగ్రవాదుల హత్యలపై రచ్చ చేస్తుండటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
details
ఇలాంటి నాయకులపై అసహ్యం వేస్తోంది : మాజీ ఎమ్మెల్యే హీద్
నిజ్జర్ హత్యకు సంబంధించి సాక్ష్యం చూపించాలని భారత్ అడిగినా, కెనడా సొంత సాక్ష్యాలను అందించకపోవడంపైనా హీద్ విస్మయం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం కెనడాలో రాజకీయ సంక్షోభం ఉందని, కెనడాలో పాలకపక్షం రాజకీయ బురదలో కూరుకుపోయిందన్నారు.
మరోవైపు మైనారిటీ నేత జగ్మీత్ సింగ్ న్యూ డెమోక్రటిక్ పార్టీపై ట్రూడో మైనారిటీ ప్రభుత్వం ఆధారపడటం వల్లే నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం అంటూ వస్తున్న ఆరోపణలపైనా హీద్ స్పందించారు.
ఇది పూర్తిగా దేశ రాజకీయ లెక్కలని, తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఇదో తప్పుడు లెక్కని, ప్రధాని సహా ఆయన లిబరల్ పార్టీ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉందన్నారు.
ట్రూడో మీదున్న రాజకీయ బురద నుంచి ఇలాంటి తీవ్రమైన నేరారోపణలతో బయటపడలేరన్నారు. ఇలాంటి నాయకులపై అసహ్యం వేస్తోందన్నారు.