Page Loader
సీసీటీవీ కెమెరాలో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య.. వాషింగ్టన్‌ పోస్టు వెల్లడి
సీసీటీవీ కెమెరాలో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య.. వాషింగ్టన్‌ పోస్టు వెల్లడి

సీసీటీవీ కెమెరాలో కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య.. వాషింగ్టన్‌ పోస్టు వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2023
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూన్‌లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని సర్రేలోని గురుద్వారా వెలుపల ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కాల్పులు, హత్యకు దారితీసిన క్షణాలు CCTV కెమెరా లో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించి అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రిక సంచలన కథనాన్ని వెలువరించింది. నిజ్జర్‌ హత్యకు సంబంధించిన వీడియోను తాము చూసినట్లు ఆ పత్రిక పేర్కొంది. హత్య జరిగిన సమీపంలోని సీసీటీవీ నుంచి ఈ పుటేజీ లభించినట్లు తెలిపింది.ఈ వీడియోలో దుండగులు రావడం.. నిజ్జర్‌ను తుపాకీతో కాల్చి వెళ్లిపోయిన దృశ్యాలు రికార్డు అయ్యాయని వెల్లడించింది. సుమారుగా 90 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో నిజ్జర్‌ వినియోగించే గ్రేకలర్‌ పికప్‌ ట్రక్‌,ఓ తెల్లటి సెడాన్‌ కారు పక్కపక్కనే సమాంతరంగా ప్రయాణిస్తున్నట్లు కనిపించినట్లు తెలిపింది.

Details 

పాయింట్‌ బ్లాంక్‌ రేంజి నుండి నిజ్జర్‌పై తూటాల వర్షం

అటు తరువాత సెడాన్‌ వేగాన్ని పెంచి పికప్‌ ట్రక్‌ ఎదురుగా వచ్చి ఒక్కసారిగా ఆగిపోయింది. అదే సమయంలో హుడెడ్‌ స్వెట్‌ షర్ట్‌లు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఆయుధాలతో పికప్‌ ట్రక్‌ వద్దకు వచ్చి పాయింట్‌ బ్లాంక్‌ రేంజి నుంచి డ్రైవర్‌ సీట్‌లో ఉన్న నిజ్జర్‌పై తూటాల వర్షం కురిపించారు. మొత్తం 50 తూటాలను కాల్చగా.. వీటిల్లో 34 అతని శరీరంలోకి దూసుకెళ్లాయి. కాల్పుల అనంతరం ఆ ఇద్దరు వ్యక్తులు సెడాన్‌ వెళ్లిన వైపుకు వేగంగా పరిగెత్తారు. ఈ ఘటన రాత్రి 8.27 సమయంలో చోటు చేసుకుంది. గురుద్వారా వాలంటీర్ అయిన భూపిందర్‌జిత్ సింగ్ సమీపంలో ఫుట్‌బాల్ ఆడుతున్నాడు. అతను మొదట తుపాకీ పేళ్ళులు విని "బాణసంచా" అని అనుకున్నాడు.

Details 

కేసు దర్యాప్తు విషయంలో వాదనలు

ఆ తరువాత అనుమానంతో ఘటనా వాదనలుస్థలానికి పరిగెత్తుకొంటూ వచ్చి చూడగా.. అప్పటికే నిజ్జర్‌ కారులో అచేతనంగా పడి ఉన్నాడు. దీంతో భూపిందర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తు ఎవరు చెయ్యాలి అనే విషయంలో కెనడా రాయల్‌ మౌంటెడ్‌ పోలీసు, సర్రే హోమిసైడ్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందం మధ్య కొద్ది సేపు వాదనలు జరగడం కూడా తీవ్ర జాప్యానికి కారణమైందని భూపిందర్‌ సింగ్‌ వెల్లడించినట్లు వాషింగ్టన్‌ పోస్టు పేర్కొంది.

Details 

భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం

గత వారం,నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల నేపథ్యంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగింది. భారతదేశం ఈ ఆరోపణలను "అసంబద్ధం","ప్రేరేపితమైనది" అని ఖండించింది. ఈ కేసుకు సంబంధించి ఒట్టావా ఒక భారతీయ అధికారిని బహిష్కరించినందుకు టిట్-ఫర్-టాట్ ఎత్తుగడలో భారత్ కూడా ఒక సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను బహిష్కరించింది.