
Kamala Harris: కమలాహారిస్ పనితీరుపై పుస్తకం.. అమెజాన్ బెస్ట్‌సెల్లర్.. ఎందుకంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ప్రధాన పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ, రాజకీయ ప్రచారం వేగం పెరిగింది.
ఈ సమయంలో, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌పై విడుదలైన ఓ సెటైర్ పుస్తకం అమెజాన్‌లో బెస్ట్ సెల్లర్‌గా మారింది.
దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు విపరీతంగా నవ్వుతున్నారు.
'ది అచీవ్‌మెంట్స్ ఆఫ్ కమలా హారిస్' అనే పుస్తకాన్ని జేసన్ డూడాస్ విడుదల చేశారు.
దీని చిత్రాలను మిషెల్ బోలెస్ సమకూర్చారు. ప్రస్తుతం ఈ పుస్తకం ఆన్‌లైన్ విక్రేత అమెజాన్‌లో బెస్ట్ సెల్లర్ జాబితాలో ఉంది.
వివరాలు
ఏడుగంటల్లో 20 లక్షల మందికి పైగా..
ఇంతకీ ఆ పుస్తకంలో ఏముందో తెలుసా..?అది పూర్తిగా తెల్ల కాగితాలతో కూడి ఉండి, కొన్ని అధ్యాయాల పేర్లను మాత్రమే కలిగి ఉంది.
వాల్‌మార్ట్ స్టోర్ బుక్ విభాగంలో ఈ పుస్తకం చిత్రీకరించిన వీడియోను టిక్‌టాక్‌లో మొదట పోస్టు చేసిన వ్యక్తి, ఆపై ఎక్స్‌లో జాక్ అనే వ్యక్తి ఇందులో చిత్రీకరించి పోస్టు చేశాడు.
ఈ వీడియోని సుమారు ఏడుగంటల్లో 20 లక్షల మందికి పైగా వీక్షించారు,వందల మంది దీనిని రీపోస్ట్ చేశారు.
అమెజాన్‌లో దీనికి సంబంధించిన సమీక్షల స్క్రీన్‌షాట్లను కూడా అతను పంచుకున్నాడు.
'ఇది పూర్తిగా వాస్తవాల ఆధారంగా రచించిన పుస్తకం. ఆమె 20 ఏళ్ల ప్రజాజీవితంపై సమగ్రంగా పరిశోధించి రాసిన వివరాల నివేదిక' అని రచయిత తెలిపారు.
వివరాలు
ఈ పుస్తకం ధర 16 డాలర్లు
అతను, వామపక్ష న్యాయవాదులు తనపై కేసులు వేస్తారనే భయంతో, ముందే 'ఈ పుస్తకం చాలావరకు ఖాళీగా ఉంది' అని నోట్‌ను జత చేశాడు.
ఈ పుస్తకంపై నెటిజన్లు వివిధ వ్యాఖ్యలు చేస్తున్నారు. 'ఈ పుస్తకం ధర 16 డాలర్లు, కానీ దీని విలువకు పోల్చలేరు' అని ఒక యూజర్ వ్యాఖ్యానించాడు.
''నేను మూడు పుస్తకాలను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఒకటి నా పొరుగింట్లో ఉన్న లిబరల్ మిత్రుడికి డెలివరీ అయింది. మిగిలిన రెండూ ఇంకా రావాల్సి ఉంది'' అని మరో యూజర్ చమత్కారంగా పేర్కొన్నాడు.