Kamala Harris : బైడన్ నిష్క్రమణ.. డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్
జో బైడన్ తప్పుకోవడంతో డెమాక్రాట్ల తరుఫున అధ్యక్ష ఎన్నికల రేసులోకి కమలా హారిస్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అమె అభ్యర్థిత్వం ఇప్పుడు అధికారికంగా ఖారారైంది. ఈ విషయాన్ని కమలా హారిస్ తన ఎక్స్‌లో స్పష్టం చేశారు. ఇప్పటికే అధ్యక్ష అభ్యర్థిగా సంబంధిత డాక్యుమెంట్లపై సంతకాలు పూర్తియ్యాయయని, తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
డొనాల్డ్ ట్రంప్‌పై కమలా హారిస్ పోటీ
ప్రతి ఒక్కరి ఓటు గెలుచుకునేందుకు తాను శ్రమిస్తానని, నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని కమలా హారిస్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడన్ అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుండి వైదొలిగిన తర్వాత, ఈ పదవికి కమలా హరిష్ బిడ్‌ను ఆమోదించారు. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా కమలా హారిస్ అమెరిక ప్రెసిడెంట్ అవుతుందని అమెకి మద్దతు తెలిపాడు. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై డెమొక్రాట్ నేత కమలా హారిస్ పోటీ చేయనున్నారు.