LOADING...
Jeff Bezos:బ్లూఆరిజిన్ రాకెట్‌లో అంతరిక్షంలోకి జెఫ్ బెజోస్ ప్రియురాలు 
బ్లూఆరిజిన్ రాకెట్‌లో అంతరిక్షంలోకి జెఫ్ బెజోస్ ప్రియురాలు

Jeff Bezos:బ్లూఆరిజిన్ రాకెట్‌లో అంతరిక్షంలోకి జెఫ్ బెజోస్ ప్రియురాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 28, 2025
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌కు చెందిన సంస్థ 'బ్లూ ఆరిజిన్' అనేక అంతరిక్ష యాత్రలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, మరో ప్రత్యేకమైన ప్రయోగానికి పునాది వేసింది. 'ఎన్‌ఎస్-31 మిషన్' పేరుతో పూర్తిగా మహిళా సభ్యులతో కూడిన అంతరిక్ష యాత్ర చేపట్టేందుకు సన్నద్ధమైంది. ఈ మిషన్‌లో బెజోస్‌ ప్రియురాలు,కాబోయే జీవిత భాగస్వామి లారెన్ శాంచెజ్ కూడా పాల్గొననున్నారు.

వివరాలు 

మార్చి నుంచి జూన్ మధ్యలో ప్రయోగం 

శాంచెజ్‌తో పాటు ప్రముఖ పాప్ సింగర్ కేటీ పెర్రీ, సీబీఎస్ న్యూస్ యాంకర్ గైలీ కింగ్, పౌర హక్కుల కార్యకర్త అమందా గుయెన్, సినీ నిర్మాత కెరియన్ ఫ్లెన్, నాసా మాజీ శాస్త్రవేత్త ఐషా బోవే కూడా న్యూ షెపర్డ్ వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి ప్రయాణించనున్నారు. ఈ ప్రయోగాన్ని మార్చి నుంచి జూన్ మధ్యలో నిర్వహించే అవకాశముందని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 అంతరిక్షంలోకి కేటీ పెర్రీ